Share News

‘బ్రాహ్మణులను మోసం చేసిన జగన్‌’

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:27 AM

సర్పవరం జంక్షన్‌, ఏప్రిల్‌ 12: టీడీపీ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన 13 సంక్షేమ పథకాలను సీఎం జగన్‌ రద్దు చేసి బ్రాహ్మణులను మోసం చేశారని కాకినాడ రూరల్‌ జనసేన కూటమి అభ్యర్థి పంతం నానాజీ విమర్శించారు. శుక్రవారం వలసపాకల గంగరాజునగర్‌ జనసేన పార్టీ కా

‘బ్రాహ్మణులను మోసం చేసిన జగన్‌’

సర్పవరం జంక్షన్‌, ఏప్రిల్‌ 12: టీడీపీ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన 13 సంక్షేమ పథకాలను సీఎం జగన్‌ రద్దు చేసి బ్రాహ్మణులను మోసం చేశారని కాకినాడ రూరల్‌ జనసేన కూటమి అభ్యర్థి పంతం నానాజీ విమర్శించారు. శుక్రవారం వలసపాకల గంగరాజునగర్‌ జనసేన పార్టీ కార్యాలయంలో సర్పవరంకు చెందిన సీనియర్‌ వైసీపీ నేత, ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దినవహి వీర్రాజు (పేరుబాబు), డీసీఎంఎస్‌ వైస్‌ ఛైర్మన్‌ మానేపల్లి బాబ్జితో పాటూ అను చరులతో కలసి జనసేనలో చేరగా వారికి నానాజీ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ కో కోఆర్డినేటర్‌ కటకంశెట్టి ప్రభాకర్‌ (బాబీ), ఎ లిశెట్టి ప్రసాద్‌, అడ్డాల సూర్యనారాయణ, రేపాక సర్వేశ్వరరావు, దివవమ వెంకట్రాజు, సంతోష్‌, దుర్గాప్రసాద్‌,శర్మ, పుల్ల శ్రీరాములు, చైర్మన్‌ శ్రీను, నారాయణరావు ఉన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 12:27 AM