Share News

అత్యంత పారదర్శకంగా ఓట్ల లెక్కింపు

ABN , Publish Date - May 29 , 2024 | 11:26 PM

సర్పవరం జంక్షన్‌, మే 29: వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపు అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పా ట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నివాస్‌ చేపట్టారని, కౌంటింగ్‌ ముగిసే వరకు నిబంధనలను పాటించాల్సిందేనని కాకినాడ రూరల్‌ ఎన్నికల అధికారి (ఆర్వో) ఇట్ల కిషోర్‌ తెలిపా

అత్యంత పారదర్శకంగా ఓట్ల లెక్కింపు
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్వో

కాకినాడ రూరల్‌ ఆర్వో ఇట్ల కిషోర్‌

సర్పవరం జంక్షన్‌, మే 29: వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపు అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పా ట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నివాస్‌ చేపట్టారని, కౌంటింగ్‌ ముగిసే వరకు నిబంధనలను పాటించాల్సిందేనని కాకినాడ రూరల్‌ ఎన్నికల అధికారి (ఆర్వో) ఇట్ల కిషోర్‌ తెలిపారు. బుధవారం సర్పవరం జంక్షన్‌లో ఆర్వో కార్యాలయంలో ఎన్నికల పోటీలో ఉన్న అభ్య ర్థులు, రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఎన్నికల కౌంటింగ్‌పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కౌంటింగ్‌కు వచ్చే ఏజెం ట్లకు గుర్తింపు పత్రాలు మంజూరు జరుగుతుందన్నారు. కౌంటింగ్‌ హాల్లోకి ఏ ఎలకా్ట్రనిక్‌ వస్తువులు అనుమతించబోమన్నారు. నియోజకవర్గం పరిధిలో 144 సెక్షన్‌ అమల్లో ఉందన్నా రు. కౌంటింగ్‌కు వచ్చే ఏజెంట్లు ఉదయం 5 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం, ముగిసే వరకు ఏ విధమైన ఘర్షణ చర్యలకు తావు లేకుండా వ్యవహరించాలన్నారు. ఇప్పటికే గ్రామస్థాయిలో రెవెన్యూ, పోలీస్‌, పంచాయతీ సిబ్బందితో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌ ముగిసేలా సహకరించాలని కోరారు. సహాయ రిటర్నింగ్‌ అధి కారి బి.విజయప్రసాద్‌, భాస్కరరావు ఉన్నారు.

Updated Date - May 29 , 2024 | 11:26 PM