‘రేషన్ బియ్యం దొంగ ద్వారంపూడి’
ABN , Publish Date - Aug 24 , 2024 | 12:29 AM
కరప, ఆగస్టు 23: కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ బియ్యం దొంగ అని, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు అతడు కలిసి ఈ రేషన్ బియ్యాన్ని బొక్కేసి కోట్ల రూపాయలను దోచేశారని ఎమ్మెల్యే పంతం నానాజీ తీవ్రస్థాయిలో ఆరోపించారు. కొరుపల్లిలో ఉద్యానవనశాఖ ఏర్పాటుచేసి
కరప, ఆగస్టు 23: కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ బియ్యం దొంగ అని, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు అతడు కలిసి ఈ రేషన్ బియ్యాన్ని బొక్కేసి కోట్ల రూపాయలను దోచేశారని ఎమ్మెల్యే పంతం నానాజీ తీవ్రస్థాయిలో ఆరోపించారు. కొరుపల్లిలో ఉద్యానవనశాఖ ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ పౌరసరఫరాలశాఖామంత్రి నాదెండ్ల మనోహర్ ద్వారంపూడికి చెందిన వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టించేశారని, త్వరలోనే అరెస్ట్‌లు కూడా ఉంటాయని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన మండలాధ్యక్షులు దేవు వెంకటేశ్వరరావు, బండారు మురళి, కొండబాబు పాల్గొన్నారు. రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలందజేశారు.