చిన్నారుల మానసిక వికాసానికి అంగన్‌వాడీలు దోహదం
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:09 AM
సర్పవరం జంక్షన్, జూలై 4: చిన్నారులు, గర్భిణులకు మెరుగైన పౌష్టికాహారం అందించడంతో పాటూ చిన్నారుల మానసిక వికాసం, ఆరోగ్యం కోసం అంగన్‌వాడీ కేం ద్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయని కాకినాడ రూర ల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. గురువారం రమణయ్యపేట ఒకటో డివిజన్‌లో కమ్యూ

సర్పవరం జంక్షన్, జూలై 4: చిన్నారులు, గర్భిణులకు మెరుగైన పౌష్టికాహారం అందించడంతో పాటూ చిన్నారుల మానసిక వికాసం, ఆరోగ్యం కోసం అంగన్‌వాడీ కేం ద్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయని కాకినాడ రూర ల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. గురువారం రమణయ్యపేట ఒకటో డివిజన్‌లో కమ్యూనిటీ హాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ పిలుస్తోంది, అన్న ప్రాసణ, సామూహిక సీమాంతాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పిల్లల సంరక్షణపై సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. అంగన్‌వాడీల సమస్యలుంటే తనదృష్టికి తీసుకువస్తే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఐసీడీఎస్ పీడీ ప్రవీణ, డిప్యూటీ మేయర్ కాళ్ల సత్తిబాబు, మాజీ కార్పొరేటర్లు పేరాబత్తుల లోవబాబు, పలివెల త్రిమూర్తులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు, శిరంగు శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.