ప్రజా శ్రేయస్సుకే కూటమి ప్రభుత్వం
ABN , Publish Date - Jul 03 , 2024 | 12:13 AM
సర్పవరం జంక్షన్, జూలై 2: రాష్ట్రాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవ న్, బీజేపీ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. మంగళవారం రమణయ్యపేట నుంచి తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి గుడికి సైకిల్‌పై వెళుతోన్న జనసైనికుడు నరా
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ
సర్పవరం జంక్షన్, జూలై 2: రాష్ట్రాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవ న్, బీజేపీ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. మంగళవారం రమణయ్యపేట నుంచి తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి గుడికి సైకిల్‌పై వెళుతోన్న జనసైనికుడు నరాల శ్రీనివాస్ సైకిల్ యాత్రను నానాజీ జెండా ఊపి ప్రారంభించారు. నానాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, పిఠాపురంలో జనసేనాధిపతి పవన్ కల్యాణ్, కాకినాడ రూరల్ నుంచి తాను ఘనవిజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీనివాస్ సైకిల్ యాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. కులమతాలకతీతంగా ప్రజలంతా ఏకపక్షంగా కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పగించారని, ప్రజల ఆశలను నూటికి నూరు శాతం నెరవేర్చేలా కూటమి నాయకులతో కలసి అహర్శిశలు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో టీడీపీ కో కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ (బాబీ), జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస బాబా, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు తదితరులు ఉన్నారు.