Share News

‘జగనన్న మెగా కాలనీ ఏర్పాటు’

ABN , Publish Date - Jan 06 , 2024 | 12:18 AM

కరప, జనవరి 5: మండలంలో గురజనాపల్లి సమీపంలో సాల్ట్‌భూముల 180ఎకరాల్లో జగనన్న మెగా కాలనీ ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కాకినాడ రూర ల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. పెనుగుదురు, గురజనాపల్లి గ్రామాలకు చెందిన సాల్ట్‌ భూములను శుక్రవారం ఆయ

‘జగనన్న మెగా కాలనీ ఏర్పాటు’

కరప, జనవరి 5: మండలంలో గురజనాపల్లి సమీపంలో సాల్ట్‌భూముల 180ఎకరాల్లో జగనన్న మెగా కాలనీ ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కాకినాడ రూర ల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. పెనుగుదురు, గురజనాపల్లి గ్రామాలకు చెందిన సాల్ట్‌ భూములను శుక్రవారం ఆయన నాయకులు, అధికారులతో పరిశీలించి మాట్లాడారు. ఈ భూముల్లో కాకినాడ రూరల్‌, అర్బన్‌, కరప మండలలకు చెందిన 8వేల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. 2వారాల్లో పట్టాలిచ్చేందుకు జగనన్న మెగా కాలనీని రూపొందిస్తున్నామన్నారు. కాకినాడ రూరల్‌ నియోజకవర్గ పరిధిలో దాదాపు 32వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చామన్నారు. కాకినాడ ఆర్డీవో కిశోర్‌, హౌసింగ్‌ పీడీ కె.శ్రీనివాస్‌, డ్వామా ఏపీడీ మాధవి, తహశీల్దార్‌ పి.శ్రీనివాసరావు, ఎంపీ డీవో అప్పారావు, జడ్పీటీసీ యాళ్ళ సుబ్బారావు, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, వైసీపీ మండలాధ్యక్షులు చింతా ఈశ్వరరావు, పబ్బినీడి పాపారావు, మండల సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షు డు రొక్కాల గణేష్‌, సర్పంచ్‌ డేగల లలిత కుమారి ఉన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 12:18 AM