Share News

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధిగా పాటించాలి

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:48 AM

సర్పవరం జంక్షన్‌, మార్చి 26: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధిగా పాటించి, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకారం అందించాలని కాకినాడ రూరల్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో ఇట్ల కిషోర్‌ కోరారు. మంగళవారం సర్పవరం జంక్షన్‌లో మండల రెవెన్యూ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధిగా పాటించాలి

సర్పవరం జంక్షన్‌, మార్చి 26: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధిగా పాటించి, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకారం అందించాలని కాకినాడ రూరల్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో ఇట్ల కిషోర్‌ కోరారు. మంగళవారం సర్పవరం జంక్షన్‌లో మండల రెవెన్యూ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ఎన్నికల ప్రచారం కోసం నిర్వహించే ర్యాలీలు, బహిరంగ స మావేశాలు, వాహనాల కోసం ముందస్తుగా అనుమతులు తీసుకోవాలలన్నారు. సువిధ యాప్‌, నేరుగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ధరఖాస్తు చేసుకుని అనుమతులు పొందవచ్చన్నారు. రాజకీయపార్టీలు దరఖాస్తు చేసిన 48 గంటల్లో అనుమతులు మంజూరు జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లకుండా చేసుకోవాలని కాకినాడ ఎస్‌డీపీవో కె.హనుమంతరావు కోరారు. ఎంసీసీపై పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన అనుమానాలు, సమస్యలపై రిటర్నింగ్‌ అధికారికి వివరించారు. సమావేశంలో జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ, రావూరి వెంకటేశ్వరరావు (వైసీపీ), గదుల సాయిబాబా (టీడీపీ), కె.కృష్ణమూర్తి (అప్‌), విజయరామయ్య (బీఎస్పీ), విజయరామయ్య (బీజేపీ), నాగేశ్వరరావు (సీపీఎం), టి రామ్మూర్తి (కాంగ్రెస్‌) తహశీల్దార్‌ బి.విజయప్రసాద్‌, డిటీ సురేష్‌, ఆర్‌ఐ మధు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:48 AM