Share News

నౌకలన్నీ బంద్‌..

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:21 AM

నైరుతి బంగాళాఖాతంలో ‘ఫెంగల్‌’ తుఫాను హెచ్చరిక నేపథ్యంలో ఆ ప్రభావం కాకినాడ జిల్లాపైనా పడనున్నట్టు వాతావరణశాఖ హెచ్చ రించింది. ఈ నేపథ్యంలో కాకినాడ పోర్టుకు ఒకటో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ అయిం ది. దీంతో కాకినాడ పోర్టులో ఈనెల 30వరకు ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలను ని

నౌకలన్నీ బంద్‌..

కాకినాడ పోర్టులో ఒకటో నెంబర్‌ తుఫాను హెచ్చరిక జారీ

ఈనెల 30వరకు సముద్రంలో ఎక్కడి షిప్పులు అక్కడే..

ప్రస్తుతం కాకినాడకు బియ్యం, ఇతర కార్గో కోసం పది నౌకలు రాక

వీటిలో 8 నౌకల్లోకి సరుకు లోడింగ్‌ నిలిపివేత

సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో బార్జీల రాకపోకలకూ రెడ్‌సిగ్నల్‌

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

నైరుతి బంగాళాఖాతంలో ‘ఫెంగల్‌’ తుఫాను హెచ్చరిక నేపథ్యంలో ఆ ప్రభావం కాకినాడ జిల్లాపైనా పడనున్నట్టు వాతావరణశాఖ హెచ్చ రించింది. ఈ నేపథ్యంలో కాకినాడ పోర్టుకు ఒకటో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ అయిం ది. దీంతో కాకినాడ పోర్టులో ఈనెల 30వరకు ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలను నిలిపి వేశారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో తీవ్రవా యుగుండం తుఫానుగా మరికొన్ని గంటల్లో మారనుండడంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. బలమైన ఈదురుగాలులతో బలంగా కెరటాలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఎక్కడి కక్కడ నౌకల్లోకి కార్గో లోడింగ్‌ను నిలిపివేస్తూ పోర్టు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కాకినాడ పోర్టుకు బియ్యంతోపాటు ఇతర కార్గో లోడింగ్‌, అన్‌లోడింగ్‌ కోసం పది నౌకలు వచ్చాయి. వీటిలో 2హోప్‌ ఐలాండ్‌కు సమీపంలో ఉన్నాయి. హోప్‌ఐలాండ్‌ వల్ల కొంత గాలుల తీవ్రత తక్కువగా ఉండడంతో వీటికి బుధవారం వరకు లోడింగ్‌ జరిగింది. మిగిలిన 8 నౌకలు దూరంగా ఉండడంతో వీటిని అక్కడే నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. ఈనెల 30 వరకు సముద్రంలోనే లంగరు వేయాలని సూచి ంచారు. నౌకలకు కార్గోను తరలించే బార్జీల రాకపోకలను సైతం ఈనెల 30వరకు నిలిపివే శారు. మరోపక్క తుఫాను ప్రభావంతో ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. పెద్దఎత్తున అలలు బీచ్‌రోడ్డును తాకుతున్నాయి.

Updated Date - Nov 28 , 2024 | 12:21 AM