Share News

‘కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన వైసీపీ ప్రభుత్వం’

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:34 PM

జేఎన్టీయూకే, జూన్‌ 10: గత వైసీపీ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని కాకినాడ జేఎన్టీయూకే మాజీ ఉపకులపతి, ఈఈఈ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎం

‘కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన వైసీపీ ప్రభుత్వం’

జేఎన్టీయూకే, జూన్‌ 10: గత వైసీపీ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని కాకినాడ జేఎన్టీయూకే మాజీ ఉపకులపతి, ఈఈఈ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎం.రామలింగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తాను 2018, అక్టోబరులో టీడీపీ ప్రభుత్వంలో జేఎన్టీయూకే ఉపకులపతిగా నియామకమయ్యానని, 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తన నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లిందన్నారు. దీంతో తాను సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నప్పటికీ నరసరావుపేటలోని యూసీఈఎన్‌కి డిప్యూటేషన్‌పై 2021, డిసెంబరులో తనను బదిలీ చేశారని తెలిపారు. 2023, సెప్టెంబరు నుంచి యూసీఈఎన్‌లో అధ్యయన ప్రోత్సాహక సెలవులో ఉన్న తనను యూసీఈకే ఈఈఈ విభాగం ప్రొఫెసర్‌గా సోమవారం బదిలీ చేశారని, తాను ఈ ఐదేళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని, వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల వల్ల ఎంతో మానసిక వేదన అనుభవించానని డాక్టర్‌ ఎం.రామలింగరాజు అన్నారు.

Updated Date - Jun 10 , 2024 | 11:34 PM