Share News

పీడీఎస్‌ బియ్యం ప్రభుత్వానికి జప్తు

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:36 AM

కాకినాడ సిటీ, జనవరి 20: నిత్యావసరాల చట్టం 1955, సెక్షన్‌ 6ఏ కింద జిల్లాలో నమోదైన ఏడు కేసులను శనివారం జేసీ ఎస్‌.ఇలక్కియ విచారించారు. ఈ కేసుల్లో సీజ్‌ చేసిన రూ2,84,658 విలువైన పీడీఎస్‌ బియ్యాన్ని ప్రభుత్వానికి జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న ఒక వా

పీడీఎస్‌ బియ్యం ప్రభుత్వానికి జప్తు

కాకినాడ సిటీ, జనవరి 20: నిత్యావసరాల చట్టం 1955, సెక్షన్‌ 6ఏ కింద జిల్లాలో నమోదైన ఏడు కేసులను శనివారం జేసీ ఎస్‌.ఇలక్కియ విచారించారు. ఈ కేసుల్లో సీజ్‌ చేసిన రూ2,84,658 విలువైన పీడీఎస్‌ బియ్యాన్ని ప్రభుత్వానికి జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న ఒక వాహన యజమానికి రూ.7వేలు జరిమానా, అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఫెర్టిలైజర్స్‌ యజమానులకు రూ.10వేలు జరిమానా విధించారు. ఈ మొత్తాలను సివిల్‌ సప్లయిస్‌ ఖాతాకు జమ చేయాలని జేసీ ఆదేశించారు.

Updated Date - Jan 21 , 2024 | 12:36 AM