Share News

‘క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స సులభతరం’

ABN , Publish Date - May 26 , 2024 | 12:26 AM

జీజీహెచ్‌ (కాకినాడ) మే 25 : క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుందని జీజీహెచ్‌ సూపరిండెంట్‌ (అడి షనల్‌ డైరెక్టర్‌) డా.ఎస్‌.లావణ్యకుమారి అన్నా రు. క్యాన్సర్‌ను నివారించడంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాకినాడ రంగరాయవైద్య కళాశాలలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న వైద్యాధికారులతో పాటు క్షేత్రస్థాయి సిబ్బందికి 3 రోజులు పాటు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఏపివివిపికి సం బంధించిన గైన

‘క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స సులభతరం’
అవగాహనా సదస్సులో వైద్యుల బృందం

జీజీహెచ్‌ (కాకినాడ) మే 25 : క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుందని జీజీహెచ్‌ సూపరిండెంట్‌ (అడి షనల్‌ డైరెక్టర్‌) డా.ఎస్‌.లావణ్యకుమారి అన్నా రు. క్యాన్సర్‌ను నివారించడంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాకినాడ రంగరాయవైద్య కళాశాలలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న వైద్యాధికారులతో పాటు క్షేత్రస్థాయి సిబ్బందికి 3 రోజులు పాటు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఏపివివిపికి సం బంధించిన గైనకాలజిస్ట్‌లు, డెంటిస్ట్‌లు, పలు విభాగాల వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశాలకు రేడియాలజి, పెధాలజీ, ఆంకాలజి వైద్య నిపుణులతో శిక్షణను ఇచ్చారు. లావణ్యకుమారి మా ట్లాడుతూ క్యాన్సర్‌ పట్ల నిర్లక్ష్యం తగదని, కాకినాడ జీజీహెచ్‌లో ప్రత్యేక ఆంకాలజీ విభాగం లో నిష్ణాతులైన వైద్య బృందం 24/7 వైద్య చికిత్స, సేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డా.జె.నరసింహనాయక్‌, అకాడమిక్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ డా.దేవీమాధవి, వైస్‌ ప్రిన్సిపాల్‌ (అడ్మిన్‌) డా.ఏ. విష్ణువర్ధన్‌, నోడల్‌ ఆఫీసర్‌ డా.రుక్మిణిదేవి, ఎన్‌సిడి ప్రొగ్రాం ఆఫీసర్‌ డా.ఐ.ప్రభాకర్‌, ఎపిడిమియాలజిస్ట్‌ డా.రవికుమార్‌, డా.సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2024 | 12:26 AM