Share News

బాలాజీచెరువు సెంటర్‌లో పవన్‌ సభ దైవ సంకల్పం

ABN , Publish Date - May 12 , 2024 | 12:12 AM

కాకినాడ సిటీ, మే 11: ఇదే స్థలంలో చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌లను గతంలో ద్వారంపూడి మాట్లాడకూడని మాటలు మాట్లాడానని, ఇదే బాలాజీచెరువు సెంటర్‌లో పవన్‌కల్యాణ్‌ సభకు అనుమతి ఇవ్వడం దైవ సంకల్పమని, ఈ సభ ద్వారా ద్వారంపూడి పతనం ఇక్కడి నుంచే ఆరంభం అయ్యిందని కాకినాడ సిటీ అసెంబ్లీ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం కాకి

బాలాజీచెరువు సెంటర్‌లో పవన్‌ సభ దైవ సంకల్పం
సభలో మాట్లాడుతున్న వనమాడి కొండబాబు, పాల్గొన్న పవన్‌కల్యాణ్‌, తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌

ద్వారంపూడి పతనం ఇక్కడి నుంచే ఆరంభం

కాకినాడ సిటీ అసెంబ్లీ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు

కాకినాడ సిటీ, మే 11: ఇదే స్థలంలో చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌లను గతంలో ద్వారంపూడి మాట్లాడకూడని మాటలు మాట్లాడానని, ఇదే బాలాజీచెరువు సెంటర్‌లో పవన్‌కల్యాణ్‌ సభకు అనుమతి ఇవ్వడం దైవ సంకల్పమని, ఈ సభ ద్వారా ద్వారంపూడి పతనం ఇక్కడి నుంచే ఆరంభం అయ్యిందని కాకినాడ సిటీ అసెంబ్లీ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం కాకినాడ బాలాజీచెరువు సెంటర్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సభ నిర్వహించారు. ఈ సభలో తొలుత కొండబాబు మాట్లా డుతూ ఈ నెల 11న కాకినాడ వస్తానని పవన్‌కల్యాణ్‌ గత నెల 18నే ప్రకటించారన్నారు. దీంతో పవన్‌కల్యాణ్‌ సభకు స్థలం లేకుండా చేయాలని కాకినాడలోని అన్ని సెంటర్లు కావా లని ద్వారంపూడి అనుమతి తెచ్చుకున్నాడన్నారు. పవన్‌ కల్యా ణ్‌ సభ అనుమతి కోసం రాత్రి 2 గంటల వరకు ఇబ్బంది పెట్టి ఎట్టకేలకు బాలాజీచెరువు సెంటర్‌లో అనుమతి ఇచ్చా రన్నారు. కాకినాడ గతంలో స్మార్ట్‌సిటీగా ఉండేదని, ఈ రోజున గంజాయి సిటీ, డ్రగ్స్‌ సిటీ, గూండాల సిటీ, రౌడీల సిటీగా అయిపోయిందన్నారు. కాకినాడను కాపాడాల్సిన బాధ్యతపై మొన్ననే చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని, ఈ రోజున పవన్‌కల్యాణ్‌ హామీతో కాకినాడ ప్రజలు సుభిక్షంగా ఉండను న్నారన్నారు. పవన్‌కల్యాణ్‌ రాక కోసం కాకినాడ ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. దత్తపుత్రుడు, దత్తపుత్రుడు అని పవన్‌కల్యాణ్‌ను చాలా మంది మాట్లాడు తున్నారని, పిఠాపురంలో ఉండే దైవం దత్తాత్రేయుడే అక్కడి నుంచి పోటీ చేసేందుకు పవన్‌కల్యాణ్‌ను రప్పించుకున్నార న్నారు. చంద్రబాబునాయుడు మద్దతు, పవన్‌కల్యాణ్‌ మద్దతు తో ఆంధ్ర రాష్ట్రంలో దుర్మార్గుడి పాలనను అంతమొందించి ఈ ఎన్నికల్లో గొప్ప విజయం సాధించబోతున్నామని కాకినాడ సిటీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు.

‘కొండబాబు విజయం ఖాయం’

కాకినాడ సిటీ, మే 11: ఎన్నికల్లో కాకినాడ సిటీ కూటమి అభ్యర్ధి వనమాడి కొండబాబు భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని కాకినాడ సిటీ టీడీపీ ఎన్నికల కో ఆర్డినేటర్‌ వనమాడి ఉమాశంకర్‌ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం గడువు ముగుస్తున్న తరుణంలో ఆయన ప్రచార వివరాలను తెలియజేశారు. ఉమ్మడి కార్యచరణతో కాకినాడ నగరంలోని 43 డివిజన్లలో పార్టీశ్రేణులు, కూటమి పక్షాలను కలుపుకుని విజయవంతంగా ప్రచారం పూర్తి చేశారన్నారు. ఎక్కడికక్కడ ప్రజల నుంచి అభ్యర్థి కొండబాబుకు విశేష స్పందన లభించిందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఎన్నికల ప్రచారం ప్రారం భం నుంచి ఇప్పటి వరకు కూటమి పక్షాల నాయకులు, శ్రేణు లు పూర్తి సహకారం అందించారన్నారు. ప్రజలలో కనిపిస్తున్న ఆసక్తి చూస్తుంటే 2019 ఎన్నికల కంటే ఈ సారి ఓటింగ్‌ శాతం గణనీయంగా పెరుగనుందన్నారు. కూటమి అంటే ఏమిటో చూపేలా స్నేహితులం, కుటుంబ సభ్యులందరం విస్తృతంగా ప్రచారం సాగించామన్నారు. ఈ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు రాబోతున్నాయని ఉమాశంకర్‌ పేర్కొన్నారు.

Updated Date - May 12 , 2024 | 12:12 AM