Share News

చంద్రబాబును మళ్లీ అధికారంలోకి రప్పిద్దాం

ABN , Publish Date - Apr 30 , 2024 | 01:44 AM

కాకినాడ సిటీ, ఏప్రిల్‌ 29: వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై దాడులు పెరిగిపోయాయని, ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృ ష్ట్యా మహిళల ఉన్నతి, ఔన్నత్యం కోసం చంద్రబాబును మళ్లీ అధికారంలోకి రప్పిద్దామని ప్రతి మహిళ కోరుకుంటున్నారని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక డెయిరీఫారం నూకాలమ్మ మాన్యంలో సోమవారం 11,12 డివిజన్లకు సంబంధించి మాజీ కార్పొరేటర్‌ తుమ్మల సునీత ఆధ్వర్యంలో మహిళల ఉన్నతి, ఔన్నత్యం కోసం బాబును మళ్లీ అధికా

చంద్రబాబును మళ్లీ అధికారంలోకి రప్పిద్దాం

కాకినాడ సిటీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు

కాకినాడ సిటీ, ఏప్రిల్‌ 29: వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై దాడులు పెరిగిపోయాయని, ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృ ష్ట్యా మహిళల ఉన్నతి, ఔన్నత్యం కోసం చంద్రబాబును మళ్లీ అధికారంలోకి రప్పిద్దామని ప్రతి మహిళ కోరుకుంటున్నారని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక డెయిరీఫారం నూకాలమ్మ మాన్యంలో సోమవారం 11,12 డివిజన్లకు సంబంధించి మాజీ కార్పొరేటర్‌ తుమ్మల సునీత ఆధ్వర్యంలో మహిళల ఉన్నతి, ఔన్నత్యం కోసం బాబును మళ్లీ అధికారంలోకి రప్పిద్దాం నినాదంతో మహిళా సభ నిర్వహి ంచారు. దారపు సురేష్‌ పెద్ద సంఖ్యలో తన అనుచరులతో టీడీపీలో చేరారు. కొండబాబు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టేం దుకు, నేరాల నియం త్రణకు ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేస్తామని, నిరుద్యోగ యువత కోసం ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కేదారిశెట్టి లక్ష్మీ నారాయణ, మాజీ మేయర్‌ సుంకర పావని తిరుమలకుమార్‌, మాజీ కార్పొరేటర్‌ తుమ్మల సునీత రమేష్‌, జనసేన రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్‌, డివిజన్ల నాయకులు కొల్లు కుమారి, పిల్లారి శెట్టి రాజ్యలక్ష్మి, లాలం నాగమణి, గౌసియా బేగం, మూగు చిన్ని, ముమ్మిడి విజయలక్ష్మి, కొపనాతి నాగకుమారి, పెద్దపాటి కుమారి, కాదూరి రామలక్ష్మి, పడాల రమాదేవి, ఆదిలక్ష్మి, కారంపూడి స్వాతి, దుంపా సూర్యకుమారి, కడలి వరలక్ష్మి, తిరిది ఎల్లయ మ్మ, తోగర రవణమ్మ, బుంగా సరస్వతి, బుర్ర అప్పలనరసమ్మ, సత్యవేణి పాల్గొన్నారు. పెద్దఎత్తున టీడీపీ-జనసేన-బీజేపీ శ్రేణులతో పరిసరాలు కిక్కిరిశాయి.

వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు

నగరంలోని వివిధ డివిజన్ల నుంచి వైసీపీ శ్రేణులు భారీగా టీడీపీలో చేరారు. కొండబాబు నివాసం వద్ద సోమ వారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పార్టీలో చేరికలు కొనసాగాయి. పార్టీలో చేరిన వారికి కొండబాబు కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీలో నగరానికి నాయ కుడు సోమిరెడ్డి రాము, లారీ వర్కర్స్‌ యూనియన్‌ మాజీ కార్యదర్శి చిలుకు గంగబాబు తమ అనుచరులతో చేరారు.

డివిజన్లలో ప్రచారం..

స్థానిక 10వ డివిజన్‌లో వనమాడి మోహన్‌వర్మ ఎన్నికల ప్రచారం చేశారు. 39వ డివిజన్‌లో వనమాడి హేమంత్‌కుమార్‌ పర్యటించి ఎన్నికల ప్రచారం సాగించారు. అదేవిధంగా 29వ డివిజన్‌లో వనమాడి శివప్రసాద్‌ ఇంటింటికి ఓట్లు అభ్యర్థించారు. సూపర్‌ సిక్స్‌ సంక్షేమ పథకాలు వివ రిస్తూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. 10వ డివిజన్‌లో టీడీపీ నాయకుడు చోడిపిల్లి సతీష్‌ ఇంటింటికి వెళ్లి బాబూ షూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివ రిస్తూ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబుకు సైకిల్‌ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Updated Date - Apr 30 , 2024 | 01:44 AM