Share News

ముంపు ప్రాంతాల్లో అధికారుల పర్యటన

ABN , Publish Date - Sep 10 , 2024 | 12:54 AM

గొల్లప్రోలు, సెప్టెంబరు 9: గొల్లప్రోలు పట్టణ శివారులోని సూరంపేట, జగనన్న కాలనీ తదితర ముంపు ప్రాంతాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జె.నరసిం

ముంపు ప్రాంతాల్లో అధికారుల పర్యటన
గొల్లప్రోలులో పర్యటిస్తున్న డీఎమ్‌హెచ్‌వో

గొల్లప్రోలు, సెప్టెంబరు 9: గొల్లప్రోలు పట్టణ శివారులోని సూరంపేట, జగనన్న కాలనీ తదితర ముంపు ప్రాంతాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జె.నరసింహనాయక్‌ తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన మెడికల్‌ క్యాంపును, అందిస్తున్న వైద్యసేవలను పరిశీలించారు. ముం పు ప్రభావిత 12మండలాల పరిధిలోనూ నిరంతరాయంగా వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని ముందుజాగ్రత్త చర్యలు చేపట్టామని చెప్పారు.

తొండంగి: వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం కోదాడ,కొత్తపల్లి గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించారు. ముంపునకు గురైన పొలాల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. డా ట్‌ సెంటర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ దయాకర్‌, మార్టేరు కు చెందిన డాక్టర్‌ సుధారాణి, డాక్టర్‌ రమేష్‌ బా బు పొలాలు పరిశీలించి సూచనలు చేశారు. అలాగే పెరుమాళ్ళపురం పంచాయితీ పరిధిలో చేపట్టిన ముంపు నివారణ చర్యలు కొనసాగాయి. తహశీల్దార్‌ మురార్జీ ఆర్‌ఐ వెంకటేశ్వర్రావు, టీడీపీ నేతలు యనమల నాగేశ్వర్రావు, కొయ్యా రామకేశవ, కాలిబోయిన చంద్రరావు, చొక్కా అ ప్పారవు తదితరులు పనులు పర్యవేక్షిస్తున్నారు.

గండేపల్లి: మండలంలో ఏలేరు కాలువ ప్ర భావిత ప్రాంతాలు పి.నాయకంపల్లి, కె.నాయకంపల్లి, పి.సూరంపాలెం, యర్రంపాలెం గ్రామాల ను ఎంపీడీవో వెంకటరామన్‌, తహశీల్దార్‌ పరిశీలించి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 12:54 AM