Share News

డెలివరీలు అధికంగా జరిగేలా చూడాలి

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:27 AM

గొల్లప్రోలు రూరల్‌/పిఠాపురం, జూన్‌ 11: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వాసుపత్రుల్లోనే డెలివరీలు అధికంగా జరిగేలా చూడాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.నరసింహనాయక్‌ ఆదేశించారు. ఆయన గొల్లప్రోలు మండలం చేబ్రోలు పీహెచ్‌సీ, పిఠాపురంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గల పీపీ యూ

డెలివరీలు అధికంగా జరిగేలా చూడాలి
గొల్లప్రోలు మండలం చేబ్రోలు పీహెచ్‌సీలో తనిఖీలు నిర్వహిస్తున్న డీఎమ్‌హెచ్‌వో

డీఎమ్‌హెచ్‌వో నరసింహనాయక్‌

గొల్లప్రోలు రూరల్‌/పిఠాపురం, జూన్‌ 11: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వాసుపత్రుల్లోనే డెలివరీలు అధికంగా జరిగేలా చూడాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.నరసింహనాయక్‌ ఆదేశించారు. ఆయన గొల్లప్రోలు మండలం చేబ్రోలు పీహెచ్‌సీ, పిఠాపురంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గల పీపీ యూనిట్‌ను మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలు, సేవలుపై సమీక్షించారు. గర్భిణులకు ప్రసవాలు స్థానిక పీహెచ్‌సీలు, ప్ర భుత్వాసుపత్రుల్లోనే నిర్వహించాలని సూచిం చారు. రోగులకు మరింత మెరుగుగా సేవలందించాలన్నారు. సిబ్బంది, వైద్యులు సమయపాలన పాటించాలని తెలిపారు. ఆశా డే సందర్భం గా ఆశా కార్యకర్తలతో జరిగిన సమావేశానికి హాజరై పలు సూచనలిచ్చారు. మాతా, శిశు మరణాలు జరగకుండా ప్రతి ఆరోగ్య కేంద్రాల పరిధిలో అవగాహనా సదస్సుల నిర్వహణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్‌ తులసి తదితరులున్నారు.

Updated Date - Jun 12 , 2024 | 12:27 AM