Share News

‘వ్యాధిగ్రస్తులు లేని సమాజ నిర్మాణానికి కృషి’

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:03 AM

జీజీహెచ్‌ (కాకినాడ), ఫిబ్రవరి 16: వ్యాధిగ్రస్తులు లేని సమాజ నిర్మాణానికి కృషి చేయాలని.. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ తదితర వ్యాధులు ప్రబలకుండా పాటించాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.నరసింహ నాయక్‌ తెలిపారు. శుక్రవారం కాకినాడ డీఎంహెచ్‌వో కార్యాలయంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నివారణలో భాగంగా కళాజాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయి డ్స్‌ నివారణ, నియంత్రణలో భాగంగా వీధి నాటకాల ద్వారా ప్రజ

‘వ్యాధిగ్రస్తులు లేని సమాజ నిర్మాణానికి కృషి’

జీజీహెచ్‌ (కాకినాడ), ఫిబ్రవరి 16: వ్యాధిగ్రస్తులు లేని సమాజ నిర్మాణానికి కృషి చేయాలని.. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ తదితర వ్యాధులు ప్రబలకుండా పాటించాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.నరసింహ నాయక్‌ తెలిపారు. శుక్రవారం కాకినాడ డీఎంహెచ్‌వో కార్యాలయంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నివారణలో భాగంగా కళాజాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయి డ్స్‌ నివారణ, నియంత్రణలో భాగంగా వీధి నాటకాల ద్వారా ప్రజల్లో కళాజాత ద్వారా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కళాజాత ఈనెల 16 నుంచి 27వ తేదీ వరకు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్‌, టీబీ అధికారి, డీఐవో డాక్టర్‌ రత్నకుమార్‌, డీపీఎం జిఆదిలింగం తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 12:03 AM