Share News

రోగాలకు మూలం పొగాకు వినియోగం

ABN , Publish Date - May 31 , 2024 | 11:45 PM

జీజీహెచ్‌ (కాకినాడ), మే 31: మానవ దేహంలోని సున్నితమైన అవయవాలకు త్వరితగతిన సంక్రమించే రోగాలకు మూలం అధికశాతం పొగాకు వినియోగమని జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ జె.నరసింహనాయక్‌ తెలిపారు. ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ డీఎం హెచ్‌వో కార్యాలయం నుంచి పొగాకు వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. డీఎంహె

రోగాలకు మూలం పొగాకు వినియోగం
ర్యాలీలో డీఎంహెచ్‌వో, వైద్యసిబ్బంది

డీఎంహెచ్‌వో డాక్టర్‌ నాయక్‌

జీజీహెచ్‌ (కాకినాడ), మే 31: మానవ దేహంలోని సున్నితమైన అవయవాలకు త్వరితగతిన సంక్రమించే రోగాలకు మూలం అధికశాతం పొగాకు వినియోగమని జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ జె.నరసింహనాయక్‌ తెలిపారు. ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ డీఎం హెచ్‌వో కార్యాలయం నుంచి పొగాకు వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ పొగా కు వాటి ఉత్పత్తుల వల్ల ఆరోగ్యంపై చూపే దు ష్ప్రభావాల వల్ల అనారోగ్యం పాలవడమే కాకు ండా అతడి కుటుంబ పరిస్థితి కూడా చిన్నాభిన్నమౌతుందన్నారు. ఈ ఏడాది పొగాకుకు వీడ్కోలు-ఆరోగ్యానికి స్వాగతం అనే నినాదం ద్వారా ప్రజలకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పొగాకు ద్వారా ఊపిరితిత్తులు, నోరు, గొంతు, అండాశ యం, మూత్రపిండాలు తదితర అవయవాల్లో క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. గుండెపోటు, రక్తనాళలు మూసుకుపోవడం, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు వస్తాయన్నారు. సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడంతో పాటు ఇన్స్‌లిన్‌ ఉత్పత్తి తగ్గిపోతుందన్నారు. ముఖ్యంగా మెదడులోని నాళాల్లో రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే జరిమానాతోపాటు జైలుశిక్ష పడుతుందన్నారు. స్కూల్‌లు, కాలేజీలకు 100మీటర్ల దూ రం వరకు ఏ పొగాకు ఉత్పత్తులను విక్రయించరాదన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్‌ అఽధికారి డాక్టర్‌ కె.రత్నకుమార్‌, జిల్లా ప్రొగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ ఐ.ప్రభాకర్‌ ఉన్నారు.

Updated Date - May 31 , 2024 | 11:45 PM