Share News

మాతృ, శిశు మరణాలను తగ్గించే దిశగా పని చేయాలి

ABN , Publish Date - May 23 , 2024 | 11:23 PM

డీఎంహెచ్‌వో నరసింహనాయక్‌ జీజీహెచ్‌ (కాకినాడ) మే 23: జిల్లాలో వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరూ మాతృ, శిశు మరణాలను తగ్గించే దిశగా పని చేయాలని డీఎంహె చ్‌వో డా.జె.నరసింహనాయక్‌ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న మాతృ, శిశు మరణాలను తగ్గించే దిశగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పటిష్ట చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా డీఎంహెచ్‌వో గురువారం ఆయన కార్యాలయంలో అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సిలు, యూహెచ్‌సీల వైద్యాఽధికారులతో సమీక్షా సమా

మాతృ, శిశు మరణాలను తగ్గించే దిశగా పని చేయాలి

డీఎంహెచ్‌వో నరసింహనాయక్‌

జీజీహెచ్‌ (కాకినాడ) మే 23: జిల్లాలో వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరూ మాతృ, శిశు మరణాలను తగ్గించే దిశగా పని చేయాలని డీఎంహె చ్‌వో డా.జె.నరసింహనాయక్‌ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న మాతృ, శిశు మరణాలను తగ్గించే దిశగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పటిష్ట చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా డీఎంహెచ్‌వో గురువారం ఆయన కార్యాలయంలో అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సిలు, యూహెచ్‌సీల వైద్యాఽధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గత నెలలో జరిగిన మాతృ మరణాలకు గల కారణాలపై విశ్లేషించి ప్రమాదకర పరిస్థితిలో ఉన్న హైరిస్క్‌ గర్భిణులను ముందుగా గుర్తిం చి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రభుత్వాసుపత్రులలో ప్రసవాలు అయే విధంగా అలాగే ప్రసవాంతర వైద్య సేవలు కచ్చితంగా అమలు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా గత నెలలో జరిగిన 31 శిశు మరణాలకు గల కారణాలు విశ్లేషించి ఇక ముందు మరణాల సంఖ్య తగ్గించేందుకు మరి ంత బాధ్యత వహించి ప్రతి ఆరోగ్య కేంద్రంలో శిశు మరణాలు జరగకుండా అవగాహనా సతస్సులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ఆదేశించిన మాతా,శిశు లక్ష్యాలను నూటికి నూరుశాతం సాఽధించాలని ఆదేశించారు. డీఐవో డా. కె.రత్నకుమార్‌ మాట్లాడుతూ వివిధ శాఖల సమన్వయంతో లక్ష్యాలను సాధించాలని కోరా రు. వ్యాధినిరోధక టీకాల కార్యక్రమంలో సంభవించే ప్రతికూల సంఘటనలపై (ఎఈఎఫ్‌ఐ) జిల్లా కమిటీ సమీక్ష జరిగింది. ఈ ఏడాది జరిగిన 3 ఎఈఎఫ్‌ఐ కేసులపై కమిటీ సభ్యులు చర్చించి తీసుకోవల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. కమిటీలో ఎస్‌ఎంఓ డా.జాన్‌ జుడే జాషువా, ఎపిడమాలజిస్ట్‌ డా. దేవిమాధవి, డా.ప్రసన్నకుమార్‌, డా.షరిఫ్‌ పాల్గొన్నారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్‌ డా. ఎస్‌.స్వప్న, డా.రమాదేవి, డా.జయదేవ్‌, డా. చంద్రప్రభ, గణాంకాధికారి విజయలక్ష్మి, డీఎస్‌ వో గణేష్‌, డెమో ప్రసాద్‌రాజు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2024 | 11:23 PM