Share News

‘గ్రామాభివృద్ధి ప్రణాళికను రూపొందించాలి’

ABN , Publish Date - Jan 30 , 2024 | 01:29 AM

కరప, జనవరి 29: ప్రజా సమస్యలను గుర్తించి వాటికనుగుణంగా గ్రామాభివృద్ధికి పకడ్భందీ ప్రణాళికను రూపొందించాలని కాకినాడ డీఎల్‌పీవో పి.అన్నామణి సూచించారు. కరప మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో సమావేశమై పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే ఫిబ్రవరి నెలాఖరు కల్లా ఇంటి పన్నులు, పన్నేతర వసూళ్లను నూరుశాతం పూర్తిచేసి లక్ష్యాలను చేరుకోవా

‘గ్రామాభివృద్ధి ప్రణాళికను రూపొందించాలి’

కరప, జనవరి 29: ప్రజా సమస్యలను గుర్తించి వాటికనుగుణంగా గ్రామాభివృద్ధికి పకడ్భందీ ప్రణాళికను రూపొందించాలని కాకినాడ డీఎల్‌పీవో పి.అన్నామణి సూచించారు. కరప మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో సమావేశమై పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే ఫిబ్రవరి నెలాఖరు కల్లా ఇంటి పన్నులు, పన్నేతర వసూళ్లను నూరుశాతం పూర్తిచేసి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. పంచాయతీల్లో నగదు రహిత లావాదేవీలను పూర్తిస్థాయిలో అమలుచేయాలన్నారు. స్వామిత్వ, పీఎం విశ్వకర్మ పథకం, ఏపీ పీఆర్‌ పోర్టల్‌, విద్యుత్‌ మీటర్ల సర్వే, పారిశుధ్య పనుల నిర్వహణపై సమీక్ష జరిపారు. అనంతరం కరప ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌ను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు జారీచేశారు. ఈవోపీఆర్డీ సలాది వెంకటశ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు

Updated Date - Jan 30 , 2024 | 01:29 AM