Share News

వేట్లపాలెంలో జిల్లా అధికారుల పర్యటన

ABN , Publish Date - Jun 23 , 2024 | 12:31 AM

సామర్లకోట, జూన్‌ 22: మండలంలోని వేట్ల పాలెం గ్రామంలో విరేచనాలతో డయేరియా బారిన పడి పలువురు అస్వస్థతకు గురికాగా వారిలో కొమ్మోజు సత్యవాణి(40) కాకినాడ ప్రభుత్వాసుపత్రి లో శనివారం ఉదయం మృతిచెందడంతో జిల్లా అధికారుల్లో కలవరం ప్రారంభమైంది. శుక్రవారం గ్రామంలో విరేచనాలతో జొ

వేట్లపాలెంలో జిల్లా అధికారుల పర్యటన
వేట్లపాలెంలో తాగునీటి పంపిణీ విధానాన్ని పరిశీలిస్తున్న జిల్లా పంచాయతీ అధికారిణి

గ్రామంలో పరిశుభ్రత చర్యలు

సామర్లకోట, జూన్‌ 22: మండలంలోని వేట్ల పాలెం గ్రామంలో విరేచనాలతో డయేరియా బారిన పడి పలువురు అస్వస్థతకు గురికాగా వారిలో కొమ్మోజు సత్యవాణి(40) కాకినాడ ప్రభుత్వాసుపత్రి లో శనివారం ఉదయం మృతిచెందడంతో జిల్లా అధికారుల్లో కలవరం ప్రారంభమైంది. శుక్రవారం గ్రామంలో విరేచనాలతో జొన్నలదొడ్డి తదితర ప్రాంతాలకు చెంది సుమారు 20 మంది అస్వస్థతకు గురయ్యారు. సత్వరం వేట్లపాలెం పీహెచ్‌సీ వైద్యు లు వారికి అత్యవసర వైద్యసేవలందించారు. వారిలో ముగ్గురికి ఉన్నత చికిత్సనిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయంపై ఆంధ్రజ్యోతిలో శనివారం కథనం ప్రచురితమైన విషయం విధితమే దీంతో జిల్లా పంచాయతీ అధికారిణి భారతి సౌజన్య, డీఎల్పీవో టీ.అన్నామణి, సామర్లకోట ఎంపీడీవో శ్యామ్‌సుందర్‌, ఈవోపీఆర్డీ హరికృష్ణసత్యారెడ్డి తది తర పంచాయతీ అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో 4 ఓహెచ్‌ఆర్‌ ట్యాంకు లను దగ్గరుండి శుభ్రపరిచే చర్యలు చేపట్టారు. నీటి నమూనాలు సేకరించి తాగునీటిలో కలుషితమైన అ వశేషాలు ఉన్నాయా, తాగునీరు క్లోరినేషన్‌ చేసారా తదితర అంశాలపై పరీక్షలు చేయించారు. పలు ప్రాంతాల్లో మురుగునీరులో ఉన్న పైప్‌లైన్‌లను తొలగించేలా, పైప్‌లైన్‌ లీకులను అరికట్టేలా ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ రూపను డీపీవో ఆదేశించారు. వేట్లపాలెం పీహెచ్‌సీలో భాది తుల నుంచి విరేచనా లకు గల వాస్తవసమాచారాన్ని డీపీవో సేకరించారు. తాగునీటిలో ఏ కలుషితంలేదని డీపీవో అధికారులు నివేదికలను అనుసరించి నిర్ధారించారు.

బాధితులకు ఆర్డీవో పరామర్శ

జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కాకినాడ ఆర్డీవో ఇట్ల కిషోర్‌ శనివారం ఉదయం వేట్లపాలెం చేరు కుని పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఉన్నత చికిత్స అందేలా పీహెచ్‌సీ వైద్యులను ఆదేశించారు. డయేరియా వ్యాప్తిచెందిన జొన్నలదొడ్డి ప్రాంతాన్ని సామర్లకోట తహశీల్దార్‌ వై. శ్రీనివాస్‌తో కలిసి పర్యటించారు. ఆయా కుటుంబాల నుంచి సంఘటనకు దారితీసిన పరిస్థితులపై సమా చారాన్ని సేకరించారు. పీహెచ్‌సీ వైద్యులు హిమ బింధు, పరదేశి, వీఆర్వోలు మామిడాల కామరాజు, వెంకటలక్ష్మి, కెవీవీ శ్రీను పాల్గొన్నారు. శనివారం గ్రామంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో కొ త్తగా బాధితులు ఎవరూ ఆసుపత్రికి రాలేదని వైద్యు లు చెప్పారు. కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశా ల విద్యార్థులు సుమారు పదిమంది వైద్యబృందం, మైక్రోబయోలజీ ప్రతినిధులు, మెడికల్‌, పిడియా ట్రిక్‌, తదితర ఎస్పీఎం బృందం వేట్లపాలెంలో ఇం టింటా పర్యటించి తాగునీటి నమూనాలను సేక రించి విశ్లేషించారు. ముందస్తు జాగ్రత్త చర్యలుగా కాచి వడకార్చిన నీటినే తాగాలని నిల్వ ఆహారం ఎట్టి పరిస్థితుల్లోనూ భుజించరాదని సూచించారు.

జనసేన జిల్లా అధ్యక్షుడు పర్యటన

వేట్లపాలెంలో డయేరియా వ్యాప్తి చెంది ఒక మహిళ మృతి, పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వైనంపై జనసేన పార్టీ జిల్లా అధ్య క్షుడు తుమ్మల బాబు తదితర జనసేన నాయకుల తో కలిసి శనివారం గ్రామంలో పర్యటించారు. పీహె చ్‌సీలో వైద్యం పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితు లపై ఆరా తీశారు. భాదితులకు ధైర్యం చెప్పారు.

Updated Date - Jun 23 , 2024 | 12:31 AM