Share News

జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు సన్నాహాలు

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:26 AM

కలెక్టరేట్‌ (కాకినాడ), జూన్‌ 11: జిల్లాలో ఖరీఫ్‌ పంట సాగుకు సన్నాహాలు ఆరంభ మయ్యాయి. ఈ నెలలో జిల్లాలో విస్తారంగా వర్షపాతం నమోదు అయ్యింది. దీంతో వ్యవసాయశాఖ రూపకల్పన చేసిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. కాకినాడ జిల్లాలో ఖరీఫ్‌లో 89,904

జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు సన్నాహాలు

కలెక్టరేట్‌ (కాకినాడ), జూన్‌ 11: జిల్లాలో ఖరీఫ్‌ పంట సాగుకు సన్నాహాలు ఆరంభ మయ్యాయి. ఈ నెలలో జిల్లాలో విస్తారంగా వర్షపాతం నమోదు అయ్యింది. దీంతో వ్యవసాయశాఖ రూపకల్పన చేసిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. కాకినాడ జిల్లాలో ఖరీఫ్‌లో 89,904 హెక్టార్లలో పంటలు సాగు చేయాలని ప్రణాళిక వ్యవసాయశాఖ రూపొందించింది. దీనిలో 86061 హెక్టార్లలో వరి సాగు చేయాలనీ, 187 హెక్టార్లలో మొక్కజొన్న, చిరుధాన్యాలు, అపరాలు కలిపి 764 హెక్టార్లలో సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. అలాగే 917 హెక్టార్లలో చెరుకు, 1908 హక్టార్లలో పత్తి పంట సాగు చేయాలని ప్రణాళికలో పేర్కొన్నారు. అయితే ఈనెలలో ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా విస్తారంగా నమోదు అయ్యింది. జిల్లా సరాసరి సగటు వర్షపాతం 26.6 మిల్లీ మీటర్లు కాగా 75.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అంటే సగటు వర్షపాతం కంటే అధికంగా వర్షపాతం నమోదు అయ్యింది. దీంతో సాగుకు సన్నద్ధత ఏర్పడింది. పైగా గోదావరి జలాలను కూడా కాలువలకు విడుదల చేశారు. దీంతో రైతులు విత్తనాలను సిద్ధం చేసుకుంటున్నారు.

Updated Date - Jun 12 , 2024 | 12:26 AM