పొగాకుకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Jan 10 , 2024 | 12:10 AM
అన్నవరం, జనవరి 9: ప్రతిఒక్కరూ పొగాకు, వాటి ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యకర సమాజం నెలకొల్పాలని జిల్లా వైద్యశాఖాధికారి జి.నరసింహనాయక్ పేర్కొన్నారు. మంగళవారం అన్నవరం దేవస్థానంలో సిబ్బందికి వాటిపై అవగాహన కల్పించారు. వాటి వినియోగం వల్ల క్యాన్సర్ వ్యాధితో పాటుగా
జిల్లా వైద్యశాఖాధికారి నరసింహనాయక్
అన్నవరం, జనవరి 9: ప్రతిఒక్కరూ పొగాకు, వాటి ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యకర సమాజం నెలకొల్పాలని జిల్లా వైద్యశాఖాధికారి జి.నరసింహనాయక్ పేర్కొన్నారు. మంగళవారం అన్నవరం దేవస్థానంలో సిబ్బందికి వాటిపై అవగాహన కల్పించారు. వాటి వినియోగం వల్ల క్యాన్సర్ వ్యాధితో పాటుగా వివాహం కాని వయస్సు వారు ఉపయోగిస్తే వారికి సంతానసమస్యలు ఏర్పడతాయన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌డి ప్రోగ్రాం అధికారి సత్యనారాయణ, ఈవో రామచంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
సురక్ష శిబిరం పరిశీలన
తొండంగి, జనవరి 9: ఏ.కొత్తపల్లిలో జగనన్న ఆరోగ్యసురక్షా శిబిరాన్ని జిల్లా వైద్యశాఖాధికారి జి.నరసింహనాయక్ పరిశీలించారు. వైద్యాధికారులు డాక్టర్ రవికుమార్, భారతి నుంచి రోగులకు అందిస్తున్న సేవలపై ప్రశ్నించి సంతృప్తి వ్యక్తం చేశారు. 406 మంది రోగుల్ని పరీక్షించి, వారిలో 234 మందికి రక్త పరీక్షలు జరిపామని, వారందరికి 92 రకాల మందులు ఉచితంగా అందించామన్నారు. సర్పంచ్ బెక్కం రాజావరలక్ష్మి చంద్రగిరి వైద్య ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.