Share News

శివారు ప్రాంతాలకు సాగునీరందేలా చర్యలు

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:02 AM

పిఠాపురం రూరల్‌, ఫిబ్రవరి 29: శివారు ప్రాంతాలకు ప్రణాళికాబద్దంగా సాగునీరందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వ్యవసాయాధికారి విజయకుమార్‌ తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు పిఠాపురం మండలం పి.దొంతమూరు, పి.రాయవరం తదితర గ్రామాల్లో విజయకుమార్‌, ఏలేరు ఇరిగేషన్‌ ఈఈ రామ

శివారు ప్రాంతాలకు సాగునీరందేలా చర్యలు
రైతులతో మాట్లాడుతున్న విజయకుమార్‌

జిల్లా వ్యవసాయాధికారి విజయకుమార్‌

పిఠాపురం రూరల్‌, ఫిబ్రవరి 29: శివారు ప్రాంతాలకు ప్రణాళికాబద్దంగా సాగునీరందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వ్యవసాయాధికారి విజయకుమార్‌ తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు పిఠాపురం మండలం పి.దొంతమూరు, పి.రాయవరం తదితర గ్రామాల్లో విజయకుమార్‌, ఏలేరు ఇరిగేషన్‌ ఈఈ రామగోపాల్‌ గురువారం పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. సాగునీరు విడుదలవుతున్నా శివారు ప్రాంతాలకు నీరు చేరడంలో సమన్వయలోపం ఉన్నట్టు గుర్తించారు. దీంతో గ్రామాల వారీగా ఇద్దరు అభ్యుదయ రైతులు, వీఏఏ, వీఆర్వో, పోలీసులు, లస్కర్‌లతో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాగునీటి పం పిణీని ఈ కమిటీలు క్రమబద్దీకరిస్తాయని తెలిపారు. కమిటీల ఏర్పాటుపై కాకినాడ ఎంపీ గీత, ఆర్డీవో కిషోర్‌తో చర్చి ంచినట్టు చెప్పారు. పిఠాపురం ఏడీఏ పి.స్వాతి, ఏవో అచ్యుతరావు, ఇరిగేషన్‌ ఏఈఈ శ్రీనివాసకుమార్‌ తదితరులున్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:02 AM