ఈక్రాప్ నమోదును పూర్తి చేయాలి
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:58 PM
పిఠాపురం, ఫిబ్రవరి 6: రబీలో పంటల సాగుకు సంబంధించి ఈ క్రాప్ నమోదును ఈనెల 15లోగా పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయాధికారి బీవీఎస్.హరి ఆదేశించారు. పిఠాపురంలోని వ్యవసాయశాఖ కార్యాయంలో సబ్‌డివిజన్ పరిధిలోని వ్యవసాయాధికారులు, వీఏఏలు, వీహెచ్‌ఏలు, వీఎస్‌ఏలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించాలన్నారు. ఈ క్రాఫ్ నమోదుతో వెనుకబ
జిల్లా వ్యవసాయాధికారి హరి
పిఠాపురం, ఫిబ్రవరి 6: రబీలో పంటల సాగుకు సంబంధించి ఈ క్రాప్ నమోదును ఈనెల 15లోగా పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయాధికారి బీవీఎస్.హరి ఆదేశించారు. పిఠాపురంలోని వ్యవసాయశాఖ కార్యాయంలో సబ్‌డివిజన్ పరిధిలోని వ్యవసాయాధికారులు, వీఏఏలు, వీహెచ్‌ఏలు, వీఎస్‌ఏలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించాలన్నారు. ఈ క్రాఫ్ నమోదుతో వెనుకబడిన సిబ్బంది తమ పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. ఆర్బీకేల ద్వా రా అందుబాటులో ఉన్న ఎరువులు, విక్రయాలు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. రబీసాగుకు సాగునీటి లభ్యతపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. సమావేశంలో వ్యవసాయశాఖ ఏడీ పి.స్వాతి, వ్యవసాయాధికారులు అచ్యుతరావు, సత్యనారాయణ, జోగిరాజు తదితరులు పాల్గొన్నారు.