Share News

బాణసంచా విక్రయాలు చేస్తే చర్యలు తప్పవు

ABN , Publish Date - May 29 , 2024 | 11:34 PM

సామర్లకోట, మే 29: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా విజేతలు విజయోత్సవ యాత్రలు, ఊరేగింపుల నిర్వహణను ఎన్నికల కమిషన్‌ పూర్తిగా నిషేధిం చినందున బాణసంచా తయారీ, విక్రయాలు చట్టరీత్యా నేరమని.. బాణసంచా వ్యాపారులు నిబంధనల అమలుకు సహకరించాలని జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌

బాణసంచా విక్రయాలు చేస్తే చర్యలు తప్పవు
సమావేశంలో మాట్లాడుతున్న మూర్తి, పాల్గొన్న అధికారులు

జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి మూర్తి

సామర్లకోట, మే 29: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా విజేతలు విజయోత్సవ యాత్రలు, ఊరేగింపుల నిర్వహణను ఎన్నికల కమిషన్‌ పూర్తిగా నిషేధిం చినందున బాణసంచా తయారీ, విక్రయాలు చట్టరీత్యా నేరమని.. బాణసంచా వ్యాపారులు నిబంధనల అమలుకు సహకరించాలని జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి, సెట్రాజ్‌ జిల్లా అధికారి ఏవీఎస్‌ఎన్‌.మూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సామర్లకోట తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో తహశీల్దార్‌ వై.శ్రీనివాస్‌ అధ్యక్షతన పోలీసు అధికారులు, బాణసంచా తయారీదారులు, విక్రయదారులతో సమీక్షా సమా వేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మూర్తి మాట్లాడుతూ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం విజేతలు, ఓటమి చెందిన గ్రూపుల మధ్య వివాదాలు, ఘర్షణలు, దాడులు జరిగే అవకాశాలున్నందున వాటిని ముందస్తుగా నివారించేందుకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు బాణసంచా విక్రయాలు పూర్తిగా నిషేధించామన్నారు. ఎస్‌ఐ మౌనిక, బాణసంచా తయారీదారులు కొసనా హరిబాబు, గుంటముక్కల సత్యనారాయణ, తా తపూడి కృష్ణబాబు, వీఆర్వో మామిడాల కామరాజు నలజర్ల మురళీకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 11:34 PM