Share News

మద్యం అమ్మకాలపై పటిష్ట నిఘా

ABN , Publish Date - May 03 , 2024 | 12:37 AM

కాకినాడ క్రైం, మే 2: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏరులై పారే మద్యానికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ పటిష్ట నిఘాను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మద్యం దుకాణాల్లో విక్రయాలు సాగినా డిజిటల్‌ పేమెంట్‌లు మాత్రమే కొనసాగితే అక్రమ మద్యానికి అడ్డుకట్ట వే

మద్యం అమ్మకాలపై పటిష్ట నిఘా

కాకినాడ క్రైం, మే 2: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏరులై పారే మద్యానికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ పటిష్ట నిఘాను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మద్యం దుకాణాల్లో విక్రయాలు సాగినా డిజిటల్‌ పేమెంట్‌లు మాత్రమే కొనసాగితే అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేయవచ్చన్న సంకల్పంతో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు ఆశాఖ డిప్యూటీ కమిషనర్‌ డి.శ్రీకాంత్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ ఎస్‌కేడీవీ ప్రసాద్‌ గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. తమ ఆధ్వర్యంలో ఎక్సైజ్‌ ఎస్‌ఐలు డీసీ స్క్వాడ్‌, ఈఎస్‌ స్క్వాడ్‌లు తరుచూ ప్రభుత్వ మద్యం దుకాణాలతోపాటు బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు, ఆర్‌ఎస్‌, డీఎస్‌, మిథనాల్‌, మొలాసిస్‌ తదితర యూనిట్లను తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. అని ప్రభుత్వ దుకాణాల్లో డిజిటల్‌ పేమెంట్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. అక్రమ మద్యం, నాటుసారా తదితర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలకు సంబంఽధించి 08842376227 నెంబర్‌లో సమాచారం అందించి సహకరించాలని కోరారు.

Updated Date - May 03 , 2024 | 12:37 AM