Share News

‘విద్యారంగ బలోపేతానికి సహకరించాలి’

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:55 PM

కాకినాడ రూరల్‌, జూన్‌ 9: ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి నూతన ప్రభుత్వం సహకరించాలని ఎస్టీయూ కాకినాడ జిల్లా శాఖ విజ్ఞప్తిచేసింది. కాకినాడ ఎస్టీయూ భవన్‌లో ఆది వారం ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోర్త శ్రీనివాస్‌, కుసుమంచి కాశీ విశ్వనాథ్‌ల ఆధ్వర్యంలో జిల్లా శాఖ ద్వితీయ కార్యవర్గసమావేశా

‘విద్యారంగ బలోపేతానికి సహకరించాలి’
మాట్లాడుతున్న ఎస్టీయూ అధ్యక్షుడు శ్రీనివాస్‌

కాకినాడ రూరల్‌, జూన్‌ 9: ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి నూతన ప్రభుత్వం సహకరించాలని ఎస్టీయూ కాకినాడ జిల్లా శాఖ విజ్ఞప్తిచేసింది. కాకినాడ ఎస్టీయూ భవన్‌లో ఆది వారం ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోర్త శ్రీనివాస్‌, కుసుమంచి కాశీ విశ్వనాథ్‌ల ఆధ్వర్యంలో జిల్లా శాఖ ద్వితీయ కార్యవర్గసమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్త శ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యారంగంలో నూతన సంస్కరణలు చేపట్టాలని తెలుగు రాష్ట్రంలో తెలుగు, ఆంగ్ల భాషలో బోధన సమాంతరంగా కొనసాగించాలని, 12వ పీఆర్సీ అమలుకు ముందు ఐఆర్‌ 30శాతం ప్రకటించాలన్నారు. కాశీ విశ్వనాద్‌ మాట్లాడుతూ 117వ జీవోను వెంటనే రద్దు చేసి ప్రాఽథమిక, ప్రాఽథమికోన్నత, ఉన్నత పాఠశాలలను కొనసాగించాలని కోరారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదలచేసి జడ్పీ, మున్సిపల్‌ ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలన్నారు. ఎస్టీయూ 78వ ఆవిర్భా దినోత్సవం సందర్భంగా వ్యవస్థాపకులు ఎం.మొయినుద్దీన్‌, రామోజీరావు మృతి పట్ల నివాళులర్పించారు. సమావేశంలో ఎస్టీయూ నాయకులు జా నీ, కార్యదర్శి శ్రీను, ఆర్ధీక కార్యదర్శి సత్యనారాయణ సుబ్బరాజు, సంపత్‌కుమార్‌, శేఖర్‌, అర్జు న్‌కుమార్‌, రాజు, కిరణ్మయి, రాజేశ్వరి ఉన్నారు.

Updated Date - Jun 09 , 2024 | 11:55 PM