Share News

స్పార్క్‌ సంస్థను విస్తృతం చేయాలి

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:20 AM

ఏలేశ్వరం, జూన్‌ 16: స్పార్క్‌ సంస్థను దేశంలో ఉన్న అన్ని గ్రామాల్లో ప్రజలను చైతన్య పరిచేవిధంగా విస్తృతం చేయాలని జిల్లా అగ్నిమాపక ఆఫీసర్‌ అవినాష్‌ జయసిం

స్పార్క్‌ సంస్థను విస్తృతం చేయాలి
ఏలేశ్వరం సదస్సులో మాట్లాడుతున్న డీఎఫ్‌వో

డీఎఫ్‌వో అవినాష్‌ జయసింహ

ఏలేశ్వరం, జూన్‌ 16: స్పార్క్‌ సంస్థను దేశంలో ఉన్న అన్ని గ్రామాల్లో ప్రజలను చైతన్య పరిచేవిధంగా విస్తృతం చేయాలని జిల్లా అగ్నిమాపక ఆఫీసర్‌ అవినాష్‌ జయసింహ పేర్కొన్నారు. ఆదివారం స్పార్క్‌ (సైంటిఫిక్‌ పోగ్రాం, రీసెర్చ్‌ క్యూబ్‌) మూడో వార్షికోత్సవం పురస్కరించుకుని స్థా నిక లారీ యూనియన్‌ ఫంక్షన్‌ హోల్‌ నందు స్పార్క్‌ చైర్మన్‌ సందీప్‌ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా డీఆర్‌డీవో సైంటిస్ట్‌ విక్రాంత్‌, డీఎఫ్‌వో అవి నాష్‌ జయసింహ, మణిహంస పవర్‌ ప్లాంట్‌ ఎండీ వెంకట్‌రెడ్డి, డీఆర్‌వో టెక్నికల్‌ ఆఫీసర్‌ రజిని, ఏబీవీపీ ప్రెసిడెంట్‌ యచంద్ర, స్పార్క్‌ అడ్వైజర్‌ బదిరెడ్డి గోవిందు విచ్చేశారు. వారు మాట్లాడుతూ సౌబర్‌ నేరాలపై రక్షణ పొందే విధానాలపై యువత అవగాహన పెంచాలన్నారు. గత మూడేళ్లుగా స్పార్క్‌ పేరుతో చేపట్టిన కార్యక్రమాలను అభినందించారు. స్పార్క్‌ సభ్యులు ప్రధీప్‌, పవన్‌, రవి కిరణ్‌, ఆదిత్య, రోజి, సాయి, సాహుల్‌, అంజి, నవనీత్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 12:20 AM