డీఈవో పరిశీలన
ABN , Publish Date - May 26 , 2024 | 12:24 AM
గండేపల్లి, మే 25: జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ శనివారం మండలంలో మల్లేపల్లి హైస్కూల్‌లోని విద్యాకానుక స్టాక్ పాయింట్‌ను పరిశీలించి వివరాలు
గండేపల్లి, మే 25: జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ శనివారం మండలంలో మల్లేపల్లి హైస్కూల్‌లోని విద్యాకానుక స్టాక్ పాయింట్‌ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభం రోజునే ప్రతీ ఒక్క విద్యార్థికి విద్యాకానుక కిట్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాడు-నేడు పనులకు సంబంధించి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు జి.సుధామాధురి వివరాలు అడిగి తెలుసుకుని త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈవో కెహెచ్ నాయక్, కె.వెంకటరెడ్డి, కాంప్లెక్స్ రిసోర్స్‌పర్సన్లు, సిబ్బంది ఉన్నారు
జగ్గంపేట: మండలంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష లు జరుగుతున్న కేంద్రాలను డీఈవో పి.రమేష్ పరిశీలిం చారు. విద్యాకానుక రిజిస్టర్, మండల పాయింట్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. నాడు -నేడు పనులను పరిశీలంచి సం తృప్తి వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహిం చారు.ఎంఈవోలు స్వామి, సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొన్నారు.
పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు
కాకినాడ రూరల్, మే 25: పదోతరగతి అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగినట్లు డీఈవో పి.రమేష్ తెలిపారు. మొత్తం 833మంది విద్యార్థులు హిందీ పేపరు పరీక్షకు రాయాల్సి ఉండగా 231మంది హాజరయ్యా రని చెప్పారు డీఈవో 4, అసిస్టెంట్ కమిషనర్ 6, తనిఖీ అధి కారులు 9 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్టు తెలిపారు.