Share News

‘వాహనాల మరమ్మతులు వేగవంతం చేయండి’

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:10 AM

కార్పొరేషన్‌(కాకినాడ), జూలై 4: పారిశుధ్య సేవల కోసం వినియోగించే డంపర్‌బిన్లు, పుష్‌క్యాట్‌, ఇతర వాహనాల మరమ్మతులను సత్వరమే చేపట్టి పూర్తి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన బొందగుంటలోని వెహికల్‌ యార్డ్‌ను సందర్శించారు. వా

‘వాహనాల మరమ్మతులు వేగవంతం చేయండి’

కార్పొరేషన్‌(కాకినాడ), జూలై 4: పారిశుధ్య సేవల కోసం వినియోగించే డంపర్‌బిన్లు, పుష్‌క్యాట్‌, ఇతర వాహనాల మరమ్మతులను సత్వరమే చేపట్టి పూర్తి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన బొందగుంటలోని వెహికల్‌ యార్డ్‌ను సందర్శించారు. వాహనాలను శుభ్రం చేసేందుకు ఏర్పాటు చేసిన ర్యాంపును పరిశీలించారు. వాహనాల పనితీరుపై ఆరాతీశారు. సీజనల్‌ వ్యాధుల నేపథ్యంలో మెరుగైన పారిశుధ్య సేవలందించాల్సిన అవసరం ఉంద న్నారు. ఎంహెచ్‌వో డాక్టర్‌ పృథ్వీచరణ్‌, ఈ ఈ మాధవి,ఏఈ నాగేశ్వరరావు ఉన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:10 AM