త్వరలో బయోమెథనేషన్ ప్లాంట్ నిర్మాణం
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:30 AM
కార్పొరేషన్ (కాకినాడ), జూన్ 11: తడిచెత్త నుంచి సీఎన్‌జీ గ్యాస్‌ను ఉత్పత్తి చేసే బయోమెథనేషన్ ప్లాంట్ నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె.వెంకటరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులను మంగళవారం పర్యవేక్షించా రు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చొల్లంగి గ్రామంలో 6.45 ఎకరాల విస్తీర్ణంలో ఈ బయోమెథనేషన్ ప్లాంట్ నిర్మాణమవుతుందన్నారు. తడిచెత్త నుంచి సీఎన్‌జీ గ్యాస్‌ను

కాకినాడ కమిషనర్ వెంకటరావు
కార్పొరేషన్ (కాకినాడ), జూన్ 11: తడిచెత్త నుంచి సీఎన్‌జీ గ్యాస్‌ను ఉత్పత్తి చేసే బయోమెథనేషన్ ప్లాంట్ నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె.వెంకటరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులను మంగళవారం పర్యవేక్షించా రు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చొల్లంగి గ్రామంలో 6.45 ఎకరాల విస్తీర్ణంలో ఈ బయోమెథనేషన్ ప్లాంట్ నిర్మాణమవుతుందన్నారు. తడిచెత్త నుంచి సీఎన్‌జీ గ్యాస్‌ను ఉ త్పత్తి చేసేందుకు సంబంధించి హెచ్‌ఆర్ స్క్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చామన్నారు. ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ సమస్యలు, ఇతర అంశాలను సత్వరమే పరిష్కరించి పనులు వేగవంతంమయ్యే లా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోజూ 40 టన్నుల తడిచెత్తను ప్రాసెసింగ్ చేసి ద్వారా గ్యాస్‌ను ఉత్పత్తి చేసేందుకు ఈ ప్లాంట్ ఏర్పా టవుతుందన్నారు. డీఈ రామారావు ఉన్నారు.