Share News

ఎన్‌జీటీ ఆదేశాల అమలుకు చర్యలు

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:36 PM

కార్పొరేషన్‌ (కాకినాడ), జూన్‌ 10: ఘన, వ్యర్థ పదార్థాల నిర్వాహణలో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలను కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు తెలిపారు. సోమవారం ఆయన నగరంలో విస్తృతంగా పర్యటించి వివిధ పనులను పర్యవే

ఎన్‌జీటీ ఆదేశాల అమలుకు చర్యలు
అధికారులకు సూచనలిస్తున్న కమిషనర్‌

కాకినాడ కమిషనర్‌ వెంకటరావు

కార్పొరేషన్‌ (కాకినాడ), జూన్‌ 10: ఘన, వ్యర్థ పదార్థాల నిర్వాహణలో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలను కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు తెలిపారు. సోమవారం ఆయన నగరంలో విస్తృతంగా పర్యటించి వివిధ పనులను పర్యవేక్షించారు. సాలిడ్‌వేస్ట్‌, లిక్విడ్‌ వేస్ట్‌, డంపింగ్‌ యార్డులను సందర్శించారు. నగరంలో సేకరించిన చెత్తను తరలించే గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. సీనరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ పనులు మందకొడిగా సాగడంపై ఆరా తీసి పలు ఆదేశాలు ఇచ్చారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మార్గదర్శకాలను మరింత పటిష్టవంతంగా అమలు చేసేలా అవసరమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఆయన వెంట ఈఈ మాధవి, డీఈ లోవరాజు ఉన్నారు.

Updated Date - Jun 10 , 2024 | 11:36 PM