Share News

మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - May 26 , 2024 | 12:23 AM

కార్పొరేషన్‌ (కాకినాడ), మే 25: పైప్‌లైన్‌ మరమ్మతుల కారణంగా నగరంలో మంచినీటి ఎద్దడి లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన దుమ్ములపేట, సంజయ్‌నగర్‌, డైరీఫారం ప్రాంతాల్లో ఎస్‌ఈ స

మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
వాటర్‌ట్యాంకుల వద్ద ప్రజలతో మాట్లాడుతున్న కమిషనర్‌

కాకినాడ కమిషనర్‌ వెంకటరావు

కార్పొరేషన్‌ (కాకినాడ), మే 25: పైప్‌లైన్‌ మరమ్మతుల కారణంగా నగరంలో మంచినీటి ఎద్దడి లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన దుమ్ములపేట, సంజయ్‌నగర్‌, డైరీఫారం ప్రాంతాల్లో ఎస్‌ఈ సత్యకుమారి, ఇతర సిబ్బందితో కలిసి పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్న నేపథ్యంలో స్వయంగా ప్రజలతో మాట్లాడి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. శశికాంత్‌నగర్‌ ఫిల్టరేషన్‌ ప్లాంట్‌కు వెళ్లే ముడినీటి సరఫరా పైపులైన్‌ లీకేజీలను అరికట్టేందుకు మరమ్మతులు చేస్తున్న దృష్ట్యా ఒకటో డివిజన్‌ నుంచి 13 డివిజన్‌ వరకు ఈనెల 23వతేదీ నుంచి నీటి సరఫరా నిలుపుదల చేశామన్నారు. అయితే మంచినీటి కోసం ప్ర జలు ఇబ్బంది పడకుండా నగరపాలక సంస్థ మంచినీటి ట్యాంకర్లతో పాటు ప్రయివేట్‌ ట్యాంకర్లను రప్పించి ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా నీరందిస్తున్నామన్నారు. శనివారం దాదాపు 14ట్యాంకర్ల ద్వారా సుమారు 80కిపైగా ట్రిప్పులు వేసి నీటి సరఫరా తీర్చామన్నారు. అయినప్పటికీ ఎక్కడైనా నీరందకపోయిన, ఇబ్బందులు ఉన్న తక్షణమే తమ దృష్టికి తీసుకొస్తే ట్యాంకర్లను పంపించి పరిష్కరిస్తామన్నారు. అత్యవసర మరమ్మతుల దృష్ట్యా ఏర్పడ్డ ఈ అవాంతరానికి ప్రజలు సహకరించాలని కమిషనర్‌ కోరారు. నీటి సమస్య ఉంటే 9849906507, 9959799138, 9676770461, 984847 1415 నెంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.

Updated Date - May 26 , 2024 | 12:23 AM