Share News

ప్రజలకు మెరుగైన సేవలందించాలి : కమిషనర్‌

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:58 PM

కార్పొరేషన్‌ (కాకినాడ), జూన్‌ 12: ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా సచివాలయ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు ఆదేశించారు. కాకినాడ కళాక్షేత్రంలో బుధవారం టౌన్‌ప్లానింగ్‌, ఎమినిటీ, శానిటేషన్‌ సెక్రటరీలతో కమిషనర్‌ సమావేశమయ్యారు

ప్రజలకు మెరుగైన సేవలందించాలి : కమిషనర్‌

కార్పొరేషన్‌ (కాకినాడ), జూన్‌ 12: ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా సచివాలయ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు ఆదేశించారు. కాకినాడ కళాక్షేత్రంలో బుధవారం టౌన్‌ప్లానింగ్‌, ఎమినిటీ, శానిటేషన్‌ సెక్రటరీలతో కమిషనర్‌ సమావేశమయ్యారు. సచివాలయాల ద్వారా అందిస్తున్న సేవలను సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, పరిష్కరించాల్సిన సమస్యలు, ఇతర అంశాల విషయంలో సచివాలయ కార్యదర్శులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ సీహెచ్‌.నాగనరసింహారావు, ఎస్‌ఈ పి.సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్‌ గుంటూరు శేఖర్‌, కార్యదర్శి ఏసుబాబు, స్మార్ట్‌సిటీ ఎస్‌ఈ వెంకటరావు, డీసీపీ హరిదాసు, ఏసీపీ నాగశాస్త్రులు, ఎంహెచ్‌వో డాక్టర్‌ పృథ్వీచరణ్‌, ఈఈ మాధవి ఉన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 11:58 PM