Share News

కార్మికులు విధులకు హాజరుకావాలి : కమిషనర్‌

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:19 AM

కార్పొరేషన్‌ (కాకినాడ), జనవరి 8: పారిశుధ్య కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున కార్మికులు తక్షణం సమ్మె విరమించి విధులకు హాజరుకావాలని కమిషనర్‌ సీహెచ్‌.నాగనరసింహారావు కోరారు. హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ డి.పృథ్వీచరణ్‌, కార్మిక సంఘాల ప్రతినిధులు, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు, ప్రత్యేక అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలు జరిపిన నేపథ్యంలో అనేక అంశాలపై సానుకూలం

కార్మికులు విధులకు హాజరుకావాలి : కమిషనర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ నాగనరసింహారావు

కార్పొరేషన్‌ (కాకినాడ), జనవరి 8: పారిశుధ్య కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున కార్మికులు తక్షణం సమ్మె విరమించి విధులకు హాజరుకావాలని కమిషనర్‌ సీహెచ్‌.నాగనరసింహారావు కోరారు. హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ డి.పృథ్వీచరణ్‌, కార్మిక సంఘాల ప్రతినిధులు, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు, ప్రత్యేక అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలు జరిపిన నేపథ్యంలో అనేక అంశాలపై సానుకూలంగా స్పందించిందన్నారు. ప్రధాన డిమాండ్ల విషయంలో స్పష్టత వచ్చినందున పారిశుధ్య కార్మికులు విధులకు హాజరుకావాలని కోరారు. సమావేశంలో కార్యదర్శి ఎం.ఏసుబాబు, డిప్యూటీ కమిషనర్‌ కోణా శ్రీనివాస్‌, మేనేజర్‌ కర్రి సత్యనారాయణ పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం డయల్‌ యువర్‌ కమిషనర్‌, స్పందన కార్యక్రమాలు నిర్వహించా రు. ఫోన్‌ ద్వారా వివిధ ప్రాంతాల ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను కమిషనర్‌ స్వీకరించారు. అనంతరం నిర్వహించిన స్పందనలో వినతులు స్వీకరించి తక్షణం పరిష్కరి ంచాలని అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ అదికారుల పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:19 AM