Share News

ప్రతీ ఫిర్యాదుకు పరిష్కారం

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:08 AM

కార్పొరేషన్‌(కాకినాడ), జూలై 27: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, డయల్‌ యువర్‌ కమిషనర్‌ ద్వారా వచ్చిన ప్రతీ ఫిర్యాదుకు నాణ్యమైన పరిష్కారాన్ని అందిం చాలని కాకినాడ నగరపాలకసంస్థ కమిషనర్‌ భావన అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార ప్రగతిపై శనివారం అన్ని విభాగాధిపతులతో కమిషనర్‌ సమావేశమయ్యారు. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులు ఎన్ని? ఎన్ని పరిష్కారమయ్యాయి? ఇంకా ఎన్ని పరిష్కరించాల్సి ఉంది? పెం

ప్రతీ ఫిర్యాదుకు పరిష్కారం
అధికారులతో సమావేశమైన కమిషనర్‌ భావన

కాకినాడ కమిషనర్‌ భావన

కార్పొరేషన్‌(కాకినాడ), జూలై 27: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, డయల్‌ యువర్‌ కమిషనర్‌ ద్వారా వచ్చిన ప్రతీ ఫిర్యాదుకు నాణ్యమైన పరిష్కారాన్ని అందిం చాలని కాకినాడ నగరపాలకసంస్థ కమిషనర్‌ భావన అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార ప్రగతిపై శనివారం అన్ని విభాగాధిపతులతో కమిషనర్‌ సమావేశమయ్యారు. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులు ఎన్ని? ఎన్ని పరిష్కారమయ్యాయి? ఇంకా ఎన్ని పరిష్కరించాల్సి ఉంది? పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు కారణాలు ఏమిటి వంటి అంశాలపై ఆరా తీశారు. ముఖ్యంగా ఆయా విభాగాధిపతులు వచ్చిన ఫిర్యాదులను స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్‌ సీహెచ్‌.నాగనరసింహరావు, ఎస్‌ఈ పి.సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్‌ కోన శ్రీనివాస్‌, స్మార్ట్‌సిటీ ఎస్‌ఈ వెంకటరావు, ఎంహెచ్‌వో డాక్టర్‌ పృథ్వీచరణ్‌, మే నేజర్‌ కర్రి సత్యనారాయణ, ఏసీపీ నాగశాస్త్రులు, ఉద్యాన సహాయసంచాలకులు టీవీ శిరిల్‌,ఈఈ మాధవి ఉన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 12:08 AM