విశేష సేవలందించిన టంగుటూరి : కలెక్టర్
ABN , Publish Date - Aug 24 , 2024 | 12:28 AM
కలెక్టరేట్ (కాకినాడ), ఆగస్టు 23: స్వాతంత్య్ర సమర యోధుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా విశేష సేవలంది ంచా రని కలెక్టర్ షాన్‌మోహన్ అన్నారు. ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సం క్షేమశాఖ ఆధ్వర్యంలో కాకినా
కలెక్టరేట్ (కాకినాడ), ఆగస్టు 23: స్వాతంత్య్ర సమర యోధుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా విశేష సేవలంది ంచా రని కలెక్టర్ షాన్‌మోహన్ అన్నారు. ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సం క్షేమశాఖ ఆధ్వర్యంలో కాకినాడ పిఠాపురం రాజా సర్కిల్ వద్ద ఉన్న అమరజవాన్ పార్కులోని ఆయన విగ్రహానికి శుక్రవారం అధికారులతో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా వెనుకబడిన సంక్షేమశాఖ అధికారి లల్లి, అర్బన్ తహశీల్దార్ జితేంద్ర, సెట్రాజ్ మేనేజర్ కాశీవిశ్వేశ్వరరావు పాల్గొన్నారు.