Share News

అంకితాభావంతో ఎన్నికల విధులు నిర్వహించాలి

ABN , Publish Date - May 12 , 2024 | 11:48 PM

సర్పవరం జంక్షన్‌, మే 12: సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, సోమవారం జరిగే పోలి ంగ్‌ రోజున సిబ్బంది అంకితాభావంతో విధులు నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ కోరారు. ఆదివారం తిమ్మాపురం అక్నూఎంఎస్‌ఎన్‌ పీజీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి పోలింగ్‌ సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ సా

అంకితాభావంతో ఎన్నికల విధులు నిర్వహించాలి
ఎన్నికల సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతున్న కలెక్టర్‌

జిల్లా కలెక్టర్‌ నివాస్‌

సర్పవరం జంక్షన్‌, మే 12: సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, సోమవారం జరిగే పోలి ంగ్‌ రోజున సిబ్బంది అంకితాభావంతో విధులు నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ కోరారు. ఆదివారం తిమ్మాపురం అక్నూఎంఎస్‌ఎన్‌ పీజీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి పోలింగ్‌ సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ సామాగ్రి, సిబ్బంది తరలింపు ప్రక్రియ సజావుగా సాగుతుందన్నారు. పోలింగ్‌ రోజున ఉదయం మాక్‌ పోలింగ్‌ చేసిన తర్వాతే ఎన్నికలు ప్రారంభించాలన్నారు. ప్రతీ ఒక్కరూ చెక్‌లిస్ట్‌ పెట్టుకుని సమగ్ర తనిఖీ తర్వాతే పోలింగ్‌ ప్రారంభించాలన్నారు. ఎన్నికలు జరిగే సమయంలో ఈవీఎంలు మొరాయించినా ఆందోళన చెందాల్సిన పనిలేదని సెక్టార్‌ ఆఫీసర్లతో టచ్‌లో ఉండాలన్నారు. సమస్య పరిష్కరించే టెక్నికల్‌ సిబ్బంది అందుబాటులో ఉంచామన్నారు. తాగునీరు, ఆహారం, వసతి ఏర్పాటు చేశామని, వీటి నిర్వహణ కోసం ప్రతీ బీఎల్వోకి రూ. 6 వేలు వంతున డబ్బులు కేటాయించామన్నారు. ఎన్నిక ము గిసిన తర్వాత సిబ్బంది వెనక్కి వెళ్లేందుకు ప్రత్యేకంగా బస్సు లు కేటాయించామని తెలిపారు. ఆర్వో ఇట్ల కిషోర్‌ ఉన్నారు.

Updated Date - May 12 , 2024 | 11:48 PM