Share News

పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 12,329 ఓట్లు : కలెక్టర్‌

ABN , Publish Date - May 08 , 2024 | 01:05 AM

కలెక్టరేట్‌ (కాకినాడ), మే 7: జిల్లాలో మూడురోజులుగా నిర్వహించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసలిటేషన్‌ సెంటర్లలో 12,329మంది ప్రభుత్వ ఉద్యోగులు ఓటుహక్కు వినియోగిం చుకున్నారని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. మంగళవారం కాకినాడ పీఆర్‌ డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో జరుగుతున్న తొలిరోజు జిల్లాస్థాయి పోస్టల్‌

పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 12,329 ఓట్లు : కలెక్టర్‌

కలెక్టరేట్‌ (కాకినాడ), మే 7: జిల్లాలో మూడురోజులుగా నిర్వహించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసలిటేషన్‌ సెంటర్లలో 12,329మంది ప్రభుత్వ ఉద్యోగులు ఓటుహక్కు వినియోగిం చుకున్నారని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. మంగళవారం కాకినాడ పీఆర్‌ డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో జరుగుతున్న తొలిరోజు జిల్లాస్థాయి పోస్టల్‌ ఓటింగ్‌ నిమిత్తం చేసిన సదుపాయాలను పోలింగ్‌ సరళిని కలెక్టర్‌ ఎన్నికల అధికారు లతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో పోలింగ్‌ బూత్‌ల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం ఉద్యోగులకు వచ్చిన సందేహాలను స్వయంగా మాట్లాడి తెలుసుకున్నారు. నాలుగురోజులుగా పోస్టల్‌ బ్యాలెట్‌ నిమిత్తం ఉద్యోగులకు ఫెసిలిటేషన్‌ కల్పిస్తామన్నారు. ఇతర జిల్లాలో ఓటుహక్కు కలిగి కాకినాడ జిల్లాలో పనిచేస్తున్న 4,179మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ నిమిత్తం జిల్లా ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో 13 పోలింగ్‌బూత్‌లు, 11 వెరిఫికేషన్‌ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కొక్క పోలింగ్‌ బూత్‌కి 70మంది ఓటర్లు ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం కొన్ని నియోజకవర్గాలు, మధ్యాహ్నం కొన్ని నియోజ కవర్గాలుగా ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి.తిప్పేనాయక్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారి శ్రీనివాస్‌, జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి నాగార్జున, త్రినాఽథ్‌ పాల్గొన్నారు.

ఓటుహక్కు వినియోగించుకున్న ఎస్పీ

కాకినాడ క్రైం, మే 7: కాకినాడ మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ సెంటర్‌లో ఎస్పీ సుబ్రమణి సతీష్‌కుమార్‌ మంగళవారం తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటుహక్కును ప్రజలు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. గ్రామస్తులు గొడవలు, అల్లర్లకు దూరం గా ఉంటూ గ్రామాల్లో అందరూ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేందుకు ప్రతిఒక్కరూ పోలీస్‌శాఖకు సహకరించాలని కోరారు.

Updated Date - May 08 , 2024 | 08:02 AM