Share News

ముగిసిన ఓట్ల లెక్కింపు ర్యాండమైజేషన్‌

ABN , Publish Date - Jun 04 , 2024 | 01:09 AM

కలెక్టరేట్‌(కాకినాడ),జూన్‌3: సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన సిబ్బంది రెండో దశ ర్యాండ మైజేషన్‌ సోమవారం కలెక్టరేట్‌ ఎన్‌ఐసీ సెంటర్‌లో ముగిసింది. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అబ్జర్వర్ల సమక్షంలో కలెక్టర్‌ నివాస్‌, జేసీ రామ్‌సుందర్‌రెడ్డి సమక్షంలో నిర్వహిం

ముగిసిన ఓట్ల లెక్కింపు ర్యాండమైజేషన్‌
జేఎన్‌టీయూలో మీడియా సమాచార కేంద్రాన్ని పరిశీలించిన నివాస్‌

కలెక్టరేట్‌(కాకినాడ),జూన్‌3: సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన సిబ్బంది రెండో దశ ర్యాండ మైజేషన్‌ సోమవారం కలెక్టరేట్‌ ఎన్‌ఐసీ సెంటర్‌లో ముగిసింది. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అబ్జర్వర్ల సమక్షంలో కలెక్టర్‌ నివాస్‌, జేసీ రామ్‌సుందర్‌రెడ్డి సమక్షంలో నిర్వహించారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్‌ నివాస్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు లెక్కింపులో పాల్గొనే సూపర్‌వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లుల కోసం ర్యాండమైజేషన్‌ చేశామన్నారు. మంగళవారం కాకినాడ పార్లమెంట్‌తోపాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సిబ్బం దిని కేటాయించామన్నారు. ఓట్ల లెక్కింపులో 941 మంది సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి కాకినాడ జేఎన్‌టీయూలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ భావన, డీఆర్వో తిప్పేనాయక్‌, సీపీవో త్రినాథ్‌, జిల్లా ఉపాధి శిక్షణాధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఏడు నియోజకవర్గాల కౌంటింగ్‌ అబ్జర్వర్లు వీరే

జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్‌ అబ్జర్వర్లను నియమించారు. తుని నియోజకవర్గం గౌరవకుమార్‌, ప్రత్తిపాడు నియోజకవర్గం రాజేశ్‌ జోగ్‌పాల్‌, పిఠాపురం డాక్టర్‌ మేజర్‌ విశాల్‌ శర్మ, కాకినాడ రూరల్‌ నిధి సరోహి, పెద్దాపురం నియోజకవర్గం ఆల్బర్ట్‌ బిలాంగ్‌, కాకినాడ సిటీ నియోజకవర్గం ఎస్‌.గణేశ్‌, జగ్గంపేట నియోజకవర్గం డాక్టర్‌ కె. దాక్షాయణిలు అబ్జర్వర్లుగా వ్యవహరిస్తారు.

స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలించిన ఎన్నికల అధికారులు

కాకినాడ జేఎన్‌టీయూ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సెంట్రల్‌ లైబ్రరీలో ఉన్న పిఠాపురం అసెంబ్లీ కౌంటింగ్‌ కేంద్రాన్ని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, ఆర్వో రామ్‌సుందర్‌రెడ్డి, పిఠాపురం కౌంటింగ్‌ అబ్జర్వర్‌ డాక్టర్‌ మేజర్‌ విశాల్‌శర్మలు పరిశీలించారు. ఈవీఎం స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ కేం ద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ రామ్‌సుందర్‌ రెడ్డి మాట్లాడుతూ సిబ్బంది మంగళవారం ఉదయం ఆరు గంటలకు కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు సజావుగా జరి గేలా సిబ్బంది కృషిచేయాలన్నారు. కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు.

మీడియా సమాచార కేంద్రంలో సర్వంసిద్ధం

ఓట్ల లెక్కింపునకు సంబంధించి జేఎన్‌టీయూ కంప్యూటర్‌ సైన్స్‌ పీజీ బ్లాక్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమాచార కేంద్రాన్ని సోమవా రం జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సంబంధించి జేఎన్‌టీయూ కంప్యూటర్‌ సైన్స్‌ పీజీ బ్లాక్‌లో మీడియా సమాచార కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. మీడియా ప్రతినిధులకు అవసరమైన హైస్పీడ్‌ నెట్‌, టీవీలు, భోజనం, తాగునీరు ఇతర సదుపాయాలు ఏర్పాటుచేశామన్నారు. అలాగే మీడి యా ప్రతినిధులు కౌంటింగ్‌ ప్రక్రియ విజువల్స్‌ తీసుకునేందుకు ఆయా నియోజకవర్గాల కౌంటింగ్‌ కేంద్రాలకు ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. రౌండ్ల వారీగా ఎన్నికల ఫలితాలు మీడియా సమాచారం కేంద్రం ద్వారా విడుదల చేయడం జరుగుతుం దన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏడీసీ నాగ నర సింహరావు, డ్వామా పీడీ వెంకటలక్ష్మి, ఆర్డబ్యూఎస్‌ ఎస్‌ఈ శ్రీనివాసు, సమాచార శాఖ డీడీ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2024 | 01:09 AM