Share News

సక్రమంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలి

ABN , Publish Date - Feb 02 , 2024 | 11:39 PM

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 2: ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా అధి కారులు సక్రమంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి ణి కృతికాశుక్లా ఆదేశించారు. శుక్రవారం అమరావతి నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సీ ఈవో ముఖేష్‌కుమార్‌ మీనా.. ఎన్నికల సన్నద్ధత, ఎలకో్ట్రరల్‌ రోల్‌ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. దీనికి కాకినాడ కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఆర్వో కె.శ్రీరమణి, ఆయా నియోజకవర్గాల ఈఆర్వోలతో కలి సి హాజరయ్యారు. ఫాం 6,7,8 ధరఖాస్తుల పరిష్కారం, తుది ఓటర్ల జాబితాలోని సమ స్యలు, మార్పులు, చేర్పులు, 18-19ఏళ్ల వయసు గల ఓటర్ల వివరాలు, పోలింగ్‌ కేంద్రా ల్లో కనీస సౌకర్యాలు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, పోలింగ్‌ కేంద్రాలు, ఈవీఎంలు వం

సక్రమంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలి

కలెక్టర్‌ కృతికాశుక్లా

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 2: ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా అధి కారులు సక్రమంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి ణి కృతికాశుక్లా ఆదేశించారు. శుక్రవారం అమరావతి నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సీ ఈవో ముఖేష్‌కుమార్‌ మీనా.. ఎన్నికల సన్నద్ధత, ఎలకో్ట్రరల్‌ రోల్‌ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. దీనికి కాకినాడ కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఆర్వో కె.శ్రీరమణి, ఆయా నియోజకవర్గాల ఈఆర్వోలతో కలి సి హాజరయ్యారు. ఫాం 6,7,8 ధరఖాస్తుల పరిష్కారం, తుది ఓటర్ల జాబితాలోని సమ స్యలు, మార్పులు, చేర్పులు, 18-19ఏళ్ల వయసు గల ఓటర్ల వివరాలు, పోలింగ్‌ కేంద్రా ల్లో కనీస సౌకర్యాలు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, పోలింగ్‌ కేంద్రాలు, ఈవీఎంలు వంటి అంశాలపై ఎన్నికల సీఈవో కలెక్టర్లతో చర్చించారు. అనంతరం కలెక్టర్‌ అధికారులతో మాట్లాడుతూ ఎన్నికల కమి షన్‌ నిబంధనలు అమలు చేయాలన్నారు. ఓటు నమోదు నిరంతరం కొనసాగే ప్రక్రి యని, మార్పులు, చేర్పులకు నామినేషన్‌ చివరితేదీ వరకు అవకాశం ఉంటుందన్నారు. కాకినాడ కార్పొరేషన్‌ కమిషనర్‌ జె.వెం కటరావు, కుడా వీసీ, ఎండీ పి.కృష్ణమూర్తి, కేఎస్‌ఈజడ్‌ ఎస్డీసీ కేవీ.రామలక్ష్మి, పెద్దా పురం ఆర్డీవో జె.సీతారామారావు, బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఎ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 11:39 PM