Share News

యోగాతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:18 AM

కాకినాడ సిటీ, జూన్‌ 16: ప్రస్తుత ఆధునిక సమాజంలో యోగా ద్వారా ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఈ నెల 21వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతంజలి యోగా సమితి కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కాకి

యోగాతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కొండబాబు

కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు

కాకినాడ సిటీ, జూన్‌ 16: ప్రస్తుత ఆధునిక సమాజంలో యోగా ద్వారా ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఈ నెల 21వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతంజలి యోగా సమితి కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కాకినాడలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఎమ్మెల్యే కొండ బాబు జగన్నాధపురంలోని తన నివాసం వద్ద జెండాఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యోగా పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పతంజలి యోగా సమితి బైక్‌ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతకాలంలో ఆరోగ్యంపై దృష్టి సారించకపో వడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు గురవు తున్నారన్నారు. ఆస్తులు ఉన్నవారు అదృష్టవం తులు కారని, ఆరోగ్యంగా ఉన్నవారే అదృష్టవంతులని అందువల్ల యోగా ద్వారా ప్రతిఒక్కరు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా రు. పతంజలి యోగా సమితి గురువు రాఘవా నంద, కలగా శివరాణి, మార్తి, రాజు, నాగేశ్వర రావు, కృష్ణ, శ్రీదేవి ఉమా, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.

త్యాగానికి ప్రతి రూపం బక్రీద్‌

త్యాగానికి ప్రతి రూపం బక్రీద్‌ పండుగ అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఈ నెల 17న బక్రీద్‌ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కొండబాబు మాట్లాడుతూ ముస్లింలు జరుపు కొనే అతి పెద్ద పండుగ బక్రీద్‌ అని, ఈ పండు గ త్యాగానికి సూచికగా నిలుస్తుందన్నారు. ఇస్లా మ్‌ చరిత్రలో అబ్రహం, ఇస్మాయిల్‌లు విశ్వాసా నికి, త్యాగానికి ప్రతీకగా నిలుస్తార న్నారు. వారి త్యాగానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం లందరూ ఈ పండుగను చేసుకుంటారన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 12:18 AM