Share News

బ్యాంకు ఖాతాల్లోకే పింఛన్లు : కలెక్టర్‌

ABN , Publish Date - Apr 30 , 2024 | 01:50 AM

కలెక్టరేట్‌ (కాకినాడ), ఏప్రిల్‌ 29: జిల్లాలో ప్రతి నెలా పంపిణీ చేస్తున్న సామాజిక భద్రత పింఛన్లను మే, జూన్‌ నెల ల్లో డీబీటీ పద్ధతిలో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తామని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ వెల్లడించారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ బ్యాంకు ఖాతాలు లే

బ్యాంకు ఖాతాల్లోకే పింఛన్లు : కలెక్టర్‌

కలెక్టరేట్‌ (కాకినాడ), ఏప్రిల్‌ 29: జిల్లాలో ప్రతి నెలా పంపిణీ చేస్తున్న సామాజిక భద్రత పింఛన్లను మే, జూన్‌ నెల ల్లో డీబీటీ పద్ధతిలో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తామని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ వెల్లడించారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ బ్యాంకు ఖాతాలు లేనివారికి ఇంటి వద్దే సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తారని వెల్లడించారు. బ్యాంకు ఖాతాలు లేని దివ్యాంగులు, వయో వృద్ధులు, నడకలేక వీల్‌ చైర్లకే పరిమి తమైన వారికి సచివాలయ ఉద్యోగులు ఇంటి దగ్గరే పంపిణీ చేస్తారన్నారు. లబ్ధిదారులు పింఛన్‌ కోసం వార్డు, గ్రామ సచివా లయాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఏదైనా కారణం వల్ల ఎవరికైనా బ్యాంకు ఖాతాల్లో పింఛన్‌ సొమ్ము జమకాక పోతే మే 3లోపు ఇంటి వద్దే పింఛన్‌ పంపిణీ చేస్తారన్నారు.

స్క్వాడ్‌ దాడులు ముమ్మరం

కాకినాడ జిల్లాలో ప్లైయింగ్‌ స్వ్యాడ్‌, ఎస్‌ఎస్టీ వంటి బృం దాల దాడులు ముమ్మరంగా జరుగుతున్నాయనీ, ఇప్పటివరకు రూ.19.66కోట్ల విలువైన మద్యం, నగదు స్వాధీనం చేసుకున్నా మని కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్‌ విధుల్లో ఉన్న సిబ్బంది మే 4,5,6న పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కాకినాడ జిల్లాలో పనిచేస్తూ వేరే జిల్లాలో ఓటు ఉన్నవారు మే.7.8తేదీల్లో తమ ఓటును వేయాలన్నారు. జిల్లాలో 16,34,122 మంది ఓటర్లు ఉ న్నారని, బీఎల్వోల ద్వారా ఓటర్ల స్లిప్లు పంపిణీ కార్యక్రమం ఆరంభమైందన్నారు. జిల్లాలో 85ఏళ్లు దాటిన వృద్ధులు 621 మందికి ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. మే 13న జరిగే పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.

ముగిసిన ర్యాండమైజేషన్‌ ప్రక్రియ

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్‌ సిబ్బంది రెండో దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ సోమవారం కాకినాడ కలెక్టరేట్‌ ఎన్‌ఐసీ సెంటర్‌లో నిర్వహించారు. కలెక్టర్‌ జె.నివాస్‌, ఎన్నికల పరిశీలకులు ఎస్‌.గణేశ్‌, రాజేశ్‌ జోగ్‌పాల్‌ల సమక్షంలో నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 7 అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి పీవో, ఏపీవో, ఓపీవోలకు రెండో దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించామ న్నారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిం చడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ట్రైనీ కలెక్టర్‌ భావన, జిల్లా రెవెన్యూ అధికారి తిప్పేనాయక్‌, సీపీవో త్రినాథ్‌, ఎన్‌ఐసీ డైరె క్టర్‌ సుబ్బారావు, హౌసింగ్‌ పీడీ సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 01:50 AM