Share News

కదలరు.. వదలరు!

ABN , Publish Date - Jul 28 , 2024 | 01:23 AM

సాధారణంగా ఉన్నతాధి కారులంటే ఉద్యోగులంతా హడలిపోతారు. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. ఇక్కడ అంతా తామే అన్నట్టు ద్వితీయ శ్రేణి అధికారులు కొందరు చక్రంతిప్పుతారు.

కదలరు.. వదలరు!

వీళ్లది సెపరేట్‌ ‘పంచాయితీ’

ఏళ్ల తరబడి పాతుకుపోవడమే కారణం

ఉన్నతాధికార్లతో పనిలేదు, అంతా తామేనంటారు

కింది స్థాయి ఉద్యోగులకు నిత్యసంకటం

కార్పొరేషన్‌ (కాకినాడ), జూలై27: సాధారణంగా ఉన్నతాధి కారులంటే ఉద్యోగులంతా హడలిపోతారు. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. ఇక్కడ అంతా తామే అన్నట్టు ద్వితీయ శ్రేణి అధికారులు కొందరు చక్రంతిప్పుతారు. కింద స్థాయి ఉద్యోగులకూ వీరంటేనే దడ. కాకినాడ జిల్లా పంచాయతీ, డివిజనల్‌ పంచాయతీ కార్యాలయాల్లో దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. డీపీవో కార్యాల యంలో ఇద్దరు ద్వితీయ శ్రేణి అధికారులు, డీఎల్‌పీవో ఆఫీసు లో ఒక ద్వితీయ శ్రేణి అధికారి ఏళ్ల తరబడి పాతుకుపోయారు. అధికారంలో ఏ ప్రభుత్వమున్నా తమదే పెత్తనం అన్నట్టు వీరు వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వకాలంలో వీరిదే హవా నడవ గా, ఇప్పుడూ వారే చక్రం తిప్పుతున్న పరిస్థితి ఉంది. జిల్లా పం చాయతీ కార్యాలయం విషయానికి వస్తే ఇక్కడ దీర్ఘకాలికంగా పాతుకుపోయిన ఇద్దరు ద్వితీయ శ్రేణి అధికారులు ఎక్కడ పోస్టింగ్‌ ఇచ్చినా వారి పరపతి, పైరవీలు ఉపయోగించి కొద్దికా లానికే తిరిగి ఇక్కడికే వచ్చేస్తారు. జిల్లాలో పంచాయతీరాజ్‌ విభాగంలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగులపై అజమాయిషీ చెలాయిస్తారు. ఇక వసూళ్ల పర్వం సరేసరి. ఇటీవల పంచాయతీ కార్యదర్శులకు ఇంక్రిమెంట్లు వచ్చాయి. ఒక్కో కార్యదర్శి నుంచి అధికారులకు ఇవ్వాలంటూ వీరు రూ.3500 వసూలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అంతకంటే ముందు కార్యదర్శుల ప్రమోషన్‌ ఫైల్‌ మూవ్‌ చేయడానికి ఒక్కో కార్యదర్శి నుం చి కనీసం వెయ్యి తీసుకున్నట్టు సమాచారం. ఉన్నతాధికారుల టూర్‌ డైరీల పేరిట కూడా వీరే రహస్య వసూళ్లు చేస్తారు. పంచాయతీ ఆదాయాన్ని బట్టి వీరే రేటు నిర్ణయిస్తారనే ఆరోపణలున్నాయి. ఎవరైనా పంచాయతీ కార్యదర్శి సహకరించకపోతే వారిపై ఫిర్యాదు చేయించే వ్యూహాన్ని కూడా వీరే అమలు చేస్తారంటూ కొందరు కార్యదర్శులు వాపోతున్నారు. విచారణ పేరుతో వారి చుట్టూనే తాము కాళ్లరిగేలా తిరగాల్సి ఉంటుం దని చెబుతున్నారు. ఈ విషయాలను ఉన్నత స్థాయి అధికారు లు, ఇతర సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలంటే కింది స్థాయి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు భయపడతా రు. ఎక్కడ తమ పేర్లు బయటపడితే ఇబ్బంది వస్తుందోనని హడలిపోతున్నారు. సుదీర్ఘకాలంగా ఇదే కార్యాలయాల్లో పాతుకుపోయిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారంతా కోరు తున్నారు. ఇక కాకినాడ డీఎల్‌పీవో కార్యాలయంలో గతంలో ఒక ద్వితీయ శ్రేణి అధికారి ఎన్నో అక్రమాలకు పాల్పడుతుండేవారు. ఈయనపై ఏసీబీ కన్ను పడిందనే విషయం గ్రహించడంతో కొంతమంది సలహా మేరకు బదిలీపై వెళ్లిపోయారు. అక్కడ కూడా ఇదే తీరున నడుచుకోవడంతో అక్కడి నుంచి ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి పైరవీలు మొదలుపెట్టి అప్పటి ఒక ఎమ్మెల్యే సహకారంతో కాకినాడ పోస్టింగ్‌ వేయించుకున్నారు. దీంతో ఆయన ఆగడాలు మళ్లీ మొదలయ్యాయని, ఇలా అదే కార్యాలయాల్లో దీర్ఘకాలంలో పనిచేస్తున్న అధికారులపై దృష్టి పెట్టాల్సి ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 08:14 AM