Share News

‘జగన్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారు’

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:20 AM

సర్పవరం జంక్షన్‌, జూన్‌ 7: కాపులకు తీవ్ర అన్యాయం చేసిన సీఎం జగన్‌ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని.. పవన్‌,చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో కాపు సామాజిక వర్గంలో అత్యధిక శాతం ఓట్లు కూటమికి వేయడంతో కూటమి సునామీ సృష్టించిందని ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు, జేఏ

‘జగన్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారు’
విజయ చిహ్నం చూపుతున్న కాపు జేఏసీ సభ్యులు

సర్పవరం జంక్షన్‌, జూన్‌ 7: కాపులకు తీవ్ర అన్యాయం చేసిన సీఎం జగన్‌ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని.. పవన్‌,చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో కాపు సామాజిక వర్గంలో అత్యధిక శాతం ఓట్లు కూటమికి వేయడంతో కూటమి సునామీ సృష్టించిందని ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు, జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, ఆరేటి ప్రకాశ్‌, నల్లా విష్ణు అన్నారు. శుక్రవారం ఎన్‌ఎఫ్‌సీఎల్‌ రోడ్డులో కాపు కల్యాణ మండపంలో రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ మహాకూటమి విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో కాపు సామాజిక వర్గం పాత్ర మరవలేమని, ఎన్టీయే కూటమికి మంచి మెజారిటీ వచ్చేలా కృషి చేసి, అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. ఈ సందర్భంగా వైసీపీ వ్యతిరేఖ ఓట్లు చీలకుండా కూటమితో జట్టుకట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా కృషి చేసిన జనసేనాధిపతి పవన్‌ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో జేఏసీ తరపున 45 స్థానాల్లో అభ్యర్థులకు ఎన్నికల ప్రచారం చేయగా 42 స్థానాల్లో అభ్యర్థులు విజయం సాధించారన్నారు. నిరు పేదలను గుర్తించి వారి సంక్షేమం, అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో పలువురు కాపు జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 12:20 AM