ఉమ్మడి కూటమిని అధికారంలోకి తేవడమే లక్ష్యం
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:46 AM
రాష్ట్ర భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు కోసం టీడీపీ-జనసేన ఉమ్మడి కూటమిని ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడమే ఉమ్మడి లక్ష్యమని టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన రాజమహేంద్రవరం ఇన్‌చార్జీ అనుశ్రీ సత్యనారాయణ అన్నారు.

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 5: రాష్ట్ర భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు కోసం టీడీపీ-జనసేన ఉమ్మడి కూటమిని ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడమే ఉమ్మడి లక్ష్యమని టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన రాజమహేంద్రవరం ఇన్‌చార్జీ అనుశ్రీ సత్యనారాయణ అన్నారు. రాజమహేంద్రవరం 46వ డివిజన్‌లో మంగళవారం రాత్రి జరిగిన చేరికల కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా విచ్చేసి వైసీపీ నుంచి టీడీపీ-జనసేన కూటమిలోకి చేరిన 150 మంది కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను పంపిణి చేశారు. జగన్‌ను ఇంటికి పంపించి వేయాలన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తురకల నిర్మల, మండల రవికుమార్, మజ్జి రాంబాబు, అగురు ధనరాజ్, మొకమాటి సత్యనారాయణ, రమణ, సలాది ఆనంద్, లక్ష్మి పాల్గొన్నారు.