Share News

ఆశగా వచ్చి.. ‘నిరాశతో వెనుదిరిగి’

ABN , Publish Date - Feb 29 , 2024 | 01:28 AM

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ‘2022లో బీటెక్‌ పూర్తయ్యింది. 2023లో ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేశాను. ఐదేళ్ల నుంచీ ఒక్క నోటిఫికేషనూ లేదు. జాబ్‌మేళాలకు వెళ్తు న్నాను. అలాగే ఇక్కడికి వచ్చాను. బయోడేటా తీసుకున్నారు. తర్వాత ఫోన్‌ చేస్తామన్నారు. నేను చదివింది బీటెక్‌. వాళ్లు ఇచ్చే జీతం పదివేలట. ప్చ్‌.. యువత బతుకు ఇదీ!’.. శ్రీను అనే ఓ అభ్యర్థి ఆవేదన. ‘నేను అన్ని కంపెనీలకూ నా రెస్యూ మ్‌ ఇచ్చేశాను. తర్వాత ఫోన్‌ చేస్తానన్నారు. ఆ ఫోన్‌ కోసం ఎదురుచూడడమే.. వస్తుందో రాదో అనుమానమే!’.. లక్ష్మీ అనే ఓ విద్యార్థిని నిర్వేదం. రాజమహేంద్రవరంలోని మార్గాని ఎస్టే ట్స్‌లో ఏర్పాటుచేసిన మెగా జాబ్‌ మేళాకు వచ్చిన ఆ అభ్య ర్థుల అభిప్రాయాలివి. నిరుద్యోగులను వైసీపీ ప్రభుత్వం ఓ తీరున మోసం చేస్తుంటే.. వైసీపీ ప్రజాప్రతినిధులు ‘తామేమి

ఆశగా వచ్చి.. ‘నిరాశతో వెనుదిరిగి’
అలంకార ప్రాయంగా కొన్ని కంపెనీల డెస్క్‌లు

జాబ్‌మేళాతో వంచన

ఉసూరుమన్న నిరుద్యోగులు

బయోడేటా తీసుకొని వెళ్లమన్న కంపెనీలు

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ‘2022లో బీటెక్‌ పూర్తయ్యింది. 2023లో ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేశాను. ఐదేళ్ల నుంచీ ఒక్క నోటిఫికేషనూ లేదు. జాబ్‌మేళాలకు వెళ్తు న్నాను. అలాగే ఇక్కడికి వచ్చాను. బయోడేటా తీసుకున్నారు. తర్వాత ఫోన్‌ చేస్తామన్నారు. నేను చదివింది బీటెక్‌. వాళ్లు ఇచ్చే జీతం పదివేలట. ప్చ్‌.. యువత బతుకు ఇదీ!’.. శ్రీను అనే ఓ అభ్యర్థి ఆవేదన. ‘నేను అన్ని కంపెనీలకూ నా రెస్యూ మ్‌ ఇచ్చేశాను. తర్వాత ఫోన్‌ చేస్తానన్నారు. ఆ ఫోన్‌ కోసం ఎదురుచూడడమే.. వస్తుందో రాదో అనుమానమే!’.. లక్ష్మీ అనే ఓ విద్యార్థిని నిర్వేదం. రాజమహేంద్రవరంలోని మార్గాని ఎస్టే ట్స్‌లో ఏర్పాటుచేసిన మెగా జాబ్‌ మేళాకు వచ్చిన ఆ అభ్య ర్థుల అభిప్రాయాలివి. నిరుద్యోగులను వైసీపీ ప్రభుత్వం ఓ తీరున మోసం చేస్తుంటే.. వైసీపీ ప్రజాప్రతినిధులు ‘తామేమి తక్కువ తిన్నామా’ అనుకుంటూ నిరుద్యోగ యువత భవిత వ్యాలతో ఆటలాడుకుంటున్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహించిన జాబ్‌ మేళాను ఎంపీ భరత్‌రామ్‌ నిస్సిగ్గుగా తమ రాజకీయ ప్రచారానికి వాడుకొన్నారు. ఆశతో వచ్చిన యువత ఉసూరుమంటూ ఇంటిదారి పట్టారు. సీఎం జగన్‌ ఐదేళ్ల నుంచీ ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక్క నోటిఫికేషనూ ఇవ్వ లేదు. పాలనాకాలం ముగుస్తుందనగా హడావుడిగా మెగా డీఎస్సీ అంటూ 30 వేల ఖాళీలకుగాను 6 వేల ఉద్యోగాలతో ఓ నోటిఫికేషన్‌ తీసుకొచ్చారు. అది దగా డీఎస్సీ అనే ఆరోప ణలు బహిరంగంగానే పెద్దఎత్తున వ్యక్తమవుతున్నాయి. జగన్‌ దారిలోనే నడుస్తున్న వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా నిరు ద్యోగుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. మెగా జాబ్‌ మేళా లంటూ ప్రచారంతో ఊదరగొడుతున్నారు. వాస్తవానికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈ మేళాలను నిర్వహిస్తోంది. రాజకీయ మైలేజీ కోసం ఎంపీ భరత్‌ వీటినీ వదల్లేదు. బుధవారం మెగా జాబ్‌ మేళా పేరుతో ఓ జాతర నిర్వహించారు. 100కి పైగా కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేస్తాయని ప్రచారం ఊదర గొట్టారు. దీంతో రాజమహేంద్రవరంతోపాటు కాకినాడ, అమ లాపురం, తణుకు తదితర ప్రాంతాల నుంచి యువత ఆశగా వచ్చారు. టెంట్లు వేసి ఒక్కో గదిలో మూడు నాలుగు సంస్థల ప్రతినిధులు కూర్చున్నారు. అభ్యర్థులను ఏవో నాలుగు ప్రశ్న లు అడిగి రెస్యూమ్‌ తీసుకొని సాగనంపారు. ఒకవేళ తాము పిలిచినా మూడు దశల్లో ఇంటర్వ్యూ జరుగుతుందని, అవన్నీ ఉత్తీర్ణత సాధిస్తే శిక్షణ ఇస్తామని తర్వాతే జాబ్‌ ఉంటుందని చెప్పి పంపేశారు. జాబ్‌లు ఇస్తామంటూ వచ్చిన కంపెనీల్లో ఒకట్రెండు మినహా మిగతావన్నీ చిన్నాచితకా కంపెనీలని తెలుస్తోంది. ఓ సంస్థ డ్రైవరు ఉద్యోగానికి కూడా జాబ్‌ మేళా ను ఆశ్రయించడం ఆశ్చర్యపరిచింది. మరోవైపు ఉద్యోగ జాత రకు వచ్చిన అభ్యర్థులతో సభ ఏర్పాటుచేశారు. ముఖ్య అతిథి గా ఎంపీ భరత్‌ విచ్చేశారు. తాము నగరానికి చేసిన మేలు అంతా ఇంతా కాదు ఎంతో.. అంటూ ఉపన్యాసం ఇచ్చారు. మిగతా వారూ ఎంపీని పొగడ్తలతో ముంచెత్తారు. మేళా ప్రవే శ ద్వారం వద్ద వచ్చేవారికి ఎంపీ బొమ్మతో ముద్రించిన కరప త్రాలను తెగ పంచేశారు. భోజన ఏర్పాట్లు చేశామని చెప్పినా సరైన పద్ధతి లేక అభ్యర్థులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.

Updated Date - Feb 29 , 2024 | 01:28 AM