14న కాకినాడలో జాబ్‌మేళా
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:32 AM
కార్పొరేషన్ (కాకినాడ), జూన్ 11: ఈనెల 14న కాకినాడలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కూల్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్‌బీఐ లైఫ్, శ్రీనివాస మెడిసిస్టమ్స్, అపోలో ఫార్మసీలో పనిచేయడానికి ఇంటర్వ్యూలు జ

కార్పొరేషన్ (కాకినాడ), జూన్ 11: ఈనెల 14న కాకినాడలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కూల్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్‌బీఐ లైఫ్, శ్రీనివాస మెడిసిస్టమ్స్, అపోలో ఫార్మసీలో పనిచేయడానికి ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఆసక్తి గల వారు సర్టిఫికెట్లు, బయోడేటా జెరాక్స్ కాపీలతో హాజరుకావాలన్నారు. సహాయం కోసం 0884-2373270 నెంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.