Share News

ప్రజల అభివృద్ధితోనే దేశాభివృద్ధి

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:39 AM

ప్రజల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర గవర్నర్‌, జేఎన్‌టీయూకే కులపతి ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. వర్సిటీలోని అలూమ్ని ఆడిటోరియంలో కాకినాడ జేఎన్టీయూకే పదో స్నాతకోత్సవా న్ని బుధవారం ఉదయం 11గంటలకు గవర్నర్‌ అధ్యక్షతన ప్రారంభించారు.

ప్రజల అభివృద్ధితోనే దేశాభివృద్ధి
జేఎన్‌టీయూకే స్నాతకోత్సవంలో మాట్లాడుతున్న రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌

  • రాష్ట్ర గవర్నర్‌, కులపతి ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌

  • ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ నేవీ రియర్‌ అడ్మిరల్‌ ఎస్‌.వెంకటశేషాచారి

  • టీసీఎస్‌ ప్రెసిడెంట్‌ వి.రాజన్నకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం

  • 64 పీహెచ్‌డీ అవార్డులు, 28 బంగారు పతకాలు ప్రధానం

  • ఘనంగా జేఎన్టీయూకే పదో స్నాతకోత్సవం

జేఎన్టీయూకే, జనవరి 31: ప్రజల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర గవర్నర్‌, జేఎన్‌టీయూకే కులపతి ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. వర్సిటీలోని అలూమ్ని ఆడిటోరియంలో కాకినాడ జేఎన్టీయూకే పదో స్నాతకోత్సవా న్ని బుధవారం ఉదయం 11గంటలకు గవర్నర్‌ అధ్యక్షతన ప్రారంభించారు. ఈ వేడుకలకు మాజీ నేవీ రియర్‌ అడ్మిరల్‌ ఎస్‌.వెంకటశేషాచారి ముఖ్యఅతి థిగా విచ్చేయగా టీసీఎస్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌ ప్రెసిడెంట్‌ వి.రాజన్న కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. జేఎన్టీయూకే ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు, ఏపీఎస్సీహెచ్‌ఈ చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, డైరెక్టర్లు, ఈసీ స భ్యులు, ప్రిన్సిపాల్స్‌ వేదికను అలంకరించారు. ఈ కార్యక్రమానికి అతిథులు, పీహెచ్‌డీ అవార్డు గ్రహీతలు, బంగారు పతక విజేతలు స్నాతకోత్సవ సంప్రదాయ వస్త్రధారణలో విచ్చేశారు.

గవర్నర్‌ అబ్దుల్‌నజీర్‌ మాట్లాడుతూ పీహెచ్‌డీ అవార్డు గ్రహీతలు, బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. జేఎన్టీయూకే న్యాక్‌ఏ+ గ్రేడ్‌, యూసీఈకే ఎన్‌బీఏ గుర్తింపు సాధించినందుకు వర్సిటీ అధికారులను ప్రశంశించారు. స్వామి వివేకానంద మాటలను గుర్తుచేశారు. ఒక ఆలోచనను స్వీకరించి దాన్ని తమ జీవితంగా చేసుకోవాల ని దాని గూర్చే ఎల్లపుడూ ఆలోచిస్తూ కలలు కంటూ లక్ష్యాన్ని సాధించాలన్నారు. తమను తాము విశ్వసించాలని, తమ జ్ఞానం సామర్ధ్యాలపై అత్యంత విశ్వాసం చూపాలని సూచించారు. ఉన్నతవిద్య విద్యార్థులకు నైతిక, రాజ్యాంగ విలువలు, కళలు, ఉత్సుకత, సాంకేతికత అధ్యయనం చేసేలా రూపొందించాలని కోరారు. వృత్తిపరంగా ప్రతిఒక్కరూ సమాజంకోసం కృషిచేయాలన్నారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని రూపుదిద్దడంలో విద్యాసంస్థల బాధ్యత ఎంతో ఉందన్నారు. అనంతరం ముఖ్యఅతిథి వెంకటశేషాచారి మాట్లాడుతూ విద్యార్థుల విజ్ఞానా న్ని పెంపొందించే పరిశ్రమలకోసం పరిశోధనాభివృద్ధి ప్రాజెక్టుల ను ప్రోత్సహించాలని కోరారు. దక్షిణ చైనా సముద్రంలోని పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ల వివాదం, ఇజ్రాయిల్‌-హమాస్‌ల వివా దం కొనసాగే అవకాశం ఉన్నందున మనదేశ తయారీ రంగంలో అత్యాధునిక సాంకేతికతను తీసుకురావడానికి ఇది గొప్ప అవకాశమన్నారు. యువకులు పరిశోధన, అభివృద్ధి సహాయంతో యుద్ధనౌకల రూపకల్పనలో ముఖ్యభూమిక పోషించాలని కోరారు. వీసీ ప్రసాదరాజు మాట్లాడుతూ ఎన్‌ఈపీ 2020 ప్రకారం ఆర్‌23 సిలబస్‌ను రూపకల్ప న చేశామన్నారు. వర్సిటీ క్రీడా విభాగానికి కేంద్రం 400మీటర్ల సింథటిక్‌ అ థ్లెటిక్‌ ట్రాక్‌ను మంజూరు చేసిందని తెలిపారు. వర్సిటీ పరిధిలోని 22ఇంజనీ రింగ్‌, ఫార్మసీ కళాశాలలు 2023-24నుంచి స్వయంప్రతిపత్తి పొందాయన్నారు. విశ్వవిద్యాలయం సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణిత విభాగాల్లో విద్యను ప్రో త్సహించేందుకు వినూత్న కోర్సులందించే చర్యలు చేపడుతున్నామన్నారు.

స్నాతకోత్సవంలో 64మందికి పీహెచ్‌డీ అవార్డు లు, 21మందికి బంగారు పతకాలను గవర్నర్‌, వీసీ ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఈసీ సభ్యులు, రెక్టార్‌ కేవీ రమణ, రిజిస్ట్రార్‌ సుమలత, మాజీ వీసీలు తులసీరామ్‌దాస్‌, కుమార్‌, శ్రీ నివాస్‌కుమార్‌, మాజీ ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌, శే షారెడ్డి, కృష్ణారావు, చైతన్యరాజు, ఈసీ సభ్యులు ఎస్‌.చంద్రశేఖర్‌, బీవీవీ సత్యనారాయణ, అమీనాబి, సతీష్‌రెడ్డి, డైరెక్టర్లు సీహెచ్‌సాయిబాబు, వి.రవీంద్ర, బి.బాలకృష్ణ, ఏ.గోపాలకృష్ణ, బీటీకృష్ణ, మురళీకృష్ణ, శ్రీనివాసులు, కృష్ణమో హన్‌ బాలాజీ, ప్రిన్సిపాల్‌ కృష్ణప్రసాద్‌, రత్నకుమారి, హరిత, పీహెచ్‌డీ గ్రహీతలు, విద్యార్థులు పాల్గొన్నారు. సాయంత్రం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

Updated Date - Feb 01 , 2024 | 12:39 AM