Share News

జియో.. జీరో!

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:44 AM

కొత్తపల్లి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): సముద్రకోత నుంచి తీరప్రాంత రక్షణకు నిర్మించిన జియో ట్యూబ్‌టెక్నాలజీ నామరూపాలు లేకు ండా సముద్రంలో కలిసిపోయింది. తుఫాన్లు, అల్పపీడనాలకు, పౌర్ణమి, సముద్రంలో ప్రతిరోజూ ఏర్పడే పోటు, పాట్లతో కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంతం క్రమే

జియో.. జీరో!
సూరాడపేటలో జియోట్యూబ్‌ నిర్మించిన ప్రాంతం

ఆనవాలు లేకుండా

కొట్టుకొనిపోయిన జియోట్యూబ్‌

ఉప్పాడ తీరంలో మాయాపట్నం నుంచి

కొత్తపట్నం వరకు జాడలేని వైనం

కెరటాల రాపిడికి

గులకరాళ్లుగా మారిన బండరాళ్లు

కొత్తపల్లి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): సముద్రకోత నుంచి తీరప్రాంత రక్షణకు నిర్మించిన జియో ట్యూబ్‌టెక్నాలజీ నామరూపాలు లేకు ండా సముద్రంలో కలిసిపోయింది. తుఫాన్లు, అల్పపీడనాలకు, పౌర్ణమి, సముద్రంలో ప్రతిరోజూ ఏర్పడే పోటు, పాట్లతో కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంతం క్రమేపీ కోతకు గురవుతూ వస్తోంది. స ముద్రకోత నివారణకు పదేళ్ల కిందట ఉప్పాడ శివా రు మాయాపట్నం నుంచి కొత్తపట్నం వరకు కిలోమీటరున్నర పొడవునా జియోట్యూబ్‌ టెక్నాలజీతో రక్షణగోడ నిర్మించారు. సముద్రకోతకు గురయ్యే మాయాపట్నం నుంచి కొత్తపట్నం వరకు ఒడ్డున మొలలోతు కెనాల్‌ ఏర్పాటు చేశారు. ఆ కెనాల్‌ కింద నుంచి ఒడ్డుపై నుంచి ఐదు మీటర్ల ఎత్తులో బండరాళ్లను గాబియాన్‌ సంచుల్లో నింపి రక్షణ గట్టును నిర్మించారు. దీంతో తుఫాన్ల సమయంలో ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు ఒడ్డును నిర్మించిన గాబియాన్‌ సంచుల్లో బండరాళ్లను ఢీకొని విడిపోవడంతో కెరటం బలం తగ్గడంతో కోత నివారణ సాధ్యమవుతుందన్న కోణంలో జియోట్యూబ్‌ నిర్మించారు.

కూటమి ప్రభుత్వంపై బాధ్యత

దశాబ్ధకాలంపాటు ఎన్నో తుఫాన్‌లను తట్టుకుని నిలబడిన జియోట్యూబ్‌ ఇటీవల వరుసగా ఏర్పడిన తుఫాన్‌లు, వాయుగుండాలతో నామరూపాలు లేకుండాపోయింది. ఇది పాడవడానికి సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, తీరప్రాంతాలకు చెంది న ఆకతాయిలు జియోట్యూబ్‌పై ఆడుకుం టూ బ్లేడ్‌లతో గాబిసంచులకు కట్టిన నైలాన్‌తాళ్లను కట్‌ చేయడం ప్రధాన కారణం. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కోనపాపపేట నుంచి ఉప్పాడ వరకు జియోట్యూబ్‌ టెక్నాలజీతో రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వడం విధితమే. రక్షణ చర్య లు చేపట్టడం ప్రభుత్వాల బాధ్యత. అదే బాధ్య త సముద్రకోతనుంచి గ్రామాన్ని, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తున్న టెక్నాలజీని బాధ్యతతో పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని మత్స్యకార పెద్ద లు చెబుతున్నారు. జియోట్యూబ్‌ టెక్నాలజీ ఏర్పా టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని తీరప్రాంత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Dec 28 , 2024 | 12:44 AM